గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, అక్టోబర్ 2017, సోమవారం

విశ్వముఖ మత్స్యత్రయ బంధము. చంపకమాల. .. .. .. శ్రీహరి వీయస్సెన్ మూర్తి

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత మత్స్యత్రయ బంధ చంపకమాలను చూడండి
.మత్స్యత్రయ బంధము. చంపకమాల
పురహర నీదు నామముల పోడిమి పోడిమిగోరి దల్చినన్ 
స్మరహర నీకథావిమలసంపద సంపద లంద జూచినన్ 
వరగుణ నీ చరిత్రమను బంధము బంధము వీడ గాంచినన్ 
ధరపయి నెందునన్ శుభవితానమునన్ జయమందు నెన్నినన్.
హరి వీయస్సెన్ మూర్తీ!
నిరుపమమగు కృషిని చేసి నేర్పుగ మీరల్
వరలఁగ మత్స్యత్రయమున
మురిపించిరి చంపకమును పొగడఁగ సుకవుల్.
బంధ కవి వీయస్సెన్ మూర్తిగారికి 
అభినందనలు.

జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్యులు శ్రీ బంధ కవి వీయస్సెన్ మూర్తిగారి ప్రతిబ అద్భుతము గానున్నది .వారి కృషికి శత వందనములు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.