గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, అక్టోబర్ 2017, మంగళవారం

బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
పండితమ్మన్యులు, నిగర్వి, సహృదయులు, 
సజ్జన సంసేవనాసక్తులు, 
సన్మార్గోద్వర్తులు,
బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి
పుట్టిన రోజు నేడే.
సహృదయ శిరోమణియైన శ్రీ ఏల్చూరి మురళీధరరావు మహోదయులకు 
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుచున్నాను.

ఈశా సంతత సంతసంబు నిడు మా యేల్చూరికిన్ బ్రేమతో
నాశింతున్ మురళీధరుండిలను మాహాత్మ్యంబుతో వర్ధిలన్,
ధీ శక్తిన్ వెలుగొందగా,  పహితాధీశుండుగా వెల్గగా,
శ్రీశా నీ పద పద్మ భక్తియుతుఁడై చెల్వొందగా నిత్యమున్.

వర యేల్చూరికులాబ్ధి చంద్ర! మురళీ! ప్రఖ్యాత సత్ పండితా!
ధర మీ పుట్టిన రోజు నేడు. శుభ సంస్తాప్యంబు చేయున్ గృపన్,
పరమానంద వసంత సంహతినిడున్ ప్రఖ్యాతిగా మీకికన్,
హరి సంతోష సుఖప్రదుండునగుచున్. హర్షంబు మిమ్మొందెడున్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్యులు బ్రమ్మశ్రీ ఏల్చూరి మురళీధర రావుగారి జన్మదిన సందర్భముగా హృదయ పూర్వక శుభాకాంక్షలు
వారికీ వారికుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.