గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, అక్టోబర్ 2017, మంగళవారం

శ్రీ కందుల వరప్రసాదు గారు విరచించిన గోమూత్రికాబంధ కందము

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఏలూరులో పోలిటెక్నిక్ కళాశాల అధ్యక్షులు 
శ్రీ కందుల వరప్రసాదు గారు 
విరచించిన గోమూత్రికాబంధ కందము నవలోకించినచో 
అభినందించక మానరు.
కందుల కవివరు కృషినే
మందును, మహనీయ బంధ మార్గములోనన్
కందము సాగెను, మధురమ
రందము ప్రవహింపఁజేయు ప్రాభవమెలసెన్.
 శ్రీ వరప్రసాదు గారికి అభినందనలు.
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు ధన్యవాద శతము. మీ చిత్ర బంధ పద్యములే నాకు ప్రేరణ, మీరు జూపు ప్రోత్సాహము మరువరానిది. మీ దీవెనలే నాకు శ్రీ రామ రక్ష. మీ పాదపద్మములకు ప్రణమిల్లుతూ ..

బంధ మన్న మీకు భయము వలదనుచు
చిత్ర మందు జూపు చెలిమి తోడ !
సుధను పంచు నెపుడు సురవరుని వలెను
బ్లాగు వీక్షకులకు బాగు గాను!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గౌరవ నీయులైన శ్రీ కందుల వరప్రసాదు గారికి అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.