గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, అక్టోబర్ 2017, ఆదివారం

మహా నాగ బంధము .. .. .. గణపవరపు వేంకటకవి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! 
గణపవరపు వేంకటకవి రచించిన 
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము కావ్యమున 
మహా నాగబంధ మంజరీ, గీతి చరణ గర్భిత సీసము నకు 
మీరెవరైనా 
చిత్రీకరించ వలసినదిగా కోరుచున్నాను.
ఈ క్రిందిది గమనించి మీరు చేయగలరు.
మహా నాగ బంధము, ‌‌‌ (మంజరీ,గీతి చరణ గర్భితము), 
ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసము,
రచనన-గణపవరపు వేంకటకవి. 
సీ. సురభి భావగరాగ సూరాగణితధామ
వర్ణిత శాశ్వతైశ్వర్యధామ
వర్ధిత దానవవార పారావార
మధ్యమస్థా మహామత్తవార
నమ్రతామరజాత నవ్యభవ్యయుతాసి
రక్షిత తాపసరత్నవర్య
వర్ణిరూపారూఢ వాసవాదరలాప
‌హారగౌరద్యుతి సారహార
వర మురజ దమితనుతహ సరసహాస
రాసలీలాభిలాష వరతమపార్థ
భద్రవస్ఫుర వారణాపారభయద
ఫణివరాచల పాలప్రభాతిరమ్య.
గర్భిత మంజరి --
సురభిభావరాగ సూరాగధామ
వర్ధిత దానవవార పారావార.
గర్భిత ఆటవెలది--
సురభి భావ రాగ సూరాగణితధామ
నమ్ర తార జాత నవ్య భవ్య
వర్య వర్ణి రూఢ వాసవాదరలాప
హీర గౌర సార హార మురజ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.