గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2017, బుధవారం

ఈశా భక్త కల్పద్రుమా. శతక రచయిత. బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ.

  జైశ్రీరామ్.
ఆర్యులారా! మన సాహితీ బంధువు బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి రచించిన " ఈశా భక్త కల్పద్రుమా " అనే శతకము ౦౬-౮-౨౦౧౭న శంకరమఠములో ఆవిష్కరింపబడినది. ఐహికాముష్మికానంద సంధాయిని ఈ శతకము. ఈ శతకము మహనీయతను గూర్చి ఆర్షవిద్యాసాగర బిరుదాంకితులయిన శ్రీమన్నారయనమూర్తిగారు, కావ్య సౌందర్యమును గూర్చి అవధాన రాజహంస బ్రహ్మశ్రీ కోట లక్ష్మీనరసింహముగారు నిరుపమానముగా వివరించిరి. వారి అభిప్రాయములను మీ ముందుంచుచు, అనంతకృష్ణగారి నమ్రత వారి వాక్యములలోనే మీ ముందుచుచున్నాను, శతకము ను ఇచట ప్రచురించి యున్నాను.
సహృదయులైనవారికి ఈ భక్తి సుగంధాన్ని అందించాలనే నా తపన. నమస్తే.
 బ్రహ్మశ్రీ మల్లాప్రగద శ్రీమన్నారాయనమూర్తి.
 బ్రహ్మశ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహ అవధాని.
ఈశా భక్త కల్పద్రుమా. శతక రచయిత. బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.
జైహింద్.
Print this post

2 comments:

anantha krishna n.v. చెప్పారు...

మీ అభిమానానికి సహస్రధా కృతజ్ఞుడను అన్నగారు.
ఆవిష్కరణ సభకు మీ అధ్యక్షత యే కదా శోభ తెచ్చినది...

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అలతి యలతి పదములతో సులభ గ్రాహ్యముగా రసరమ్యముగా నున్నది శ్రీ యుతులు అనంత క్రిష్ణ గారి " కల్పద్రుమ శతకము " .కవి పండితులకు శిరసాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.