జైశ్రీరామ్.
అష్టారచక్రబంధం
లక్ష్మీసహస్రంలోని బంధం.
ఇందులో ఎనిమిది ఆకులలోని 1,3,6,8 గడులలోని అక్షరాలను వరుసగా కలుపగా
గ్రంథకర్త పేరు,
అనువాదకర్త పేరు,
గోత్ర నామ గుణ
ప్రార్థనలను తెలిపే మరొక పద్యము కూడ మనకు కనిపించును.
శార్దూలం-
ఆదిధ్యేయ రమా ప్రశాస! మహిజాతా భాగ్యదాయామ శ్రీ
యాదేయున్, హృదయాలయున్, శమములన్ బ్రారబ్ధమున్ జించు శ్రీ
త్రేదున్, వేంకటపాదుఁ బ్రోవు, మహిరాట్చ్రీద్వారు వే శర్మ మా
యాదా కట్ కట యీభవంబు మటుమాయన్ జార్చి కర్మన్ ననున్
మనకు కనిపించు మరొక పద్యము-
విద్యున్మాల.
(1వ గడులలో) ఆ యాత్రేయశ్రీశ్రీ మానున్
(3వ గడులలో) ధ్యేయున్ వేంకట్ యాజిం శర్మన్
(6వ గడులలో) మాయాపాయీ భారద్వాజా
(8వ గడులలో) శాయున్ బ్రోవన్ జాలన్ రామా!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.