గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2017, శనివారం

బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ కృత ఈశా భక్త కల్పద్రుమా శతక ఆవిష్కరణ మహాసభ కుసాదర ఆహ్వానము.

  జైశ్రీరామ్.
మ. మహిమోపేతుఁడనంతకృష్ణ కృత సమ్మాన్యోత్కృతిన్ వెల్గు సత్
స్పృహ గొల్పే పరమేశ్వరుండు, హరియున్, భాసించు సత్ కోటగా 
 మహనీయంబగు నార్షవిద్య ఖనియౌ మాధుర్య సద్వాణిగా
రహియింపన్, కృతి వెల్వడున్ సరసులారాధింతురీ సత్కృతిన్.
తప్పకమీరలొచ్చెదరు. ధన్యత గాంచెదరీశు సత్కృపన్.
గొప్పగ నెన్ని తీరుదురు కూర్మిని యీ శతకంబు గాంచి, మీ
రప్పరమేశునా హరిని హాయిగ కాంతురు కోట మూర్తులన్.
తప్పక రండు. నేనచట తప్పక మీకయి వేచి చూచెదన్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సభకు హాజరుకాగలిగిన అదృష్ట వంతులందరికీ అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.