గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2017, బుధవారం

క్షాంతి తుల్యం తపో నాస్తి, . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. క్షాంతి తుల్యం తపో నాస్తి, సంతోషాన్నపరం సుఖం 
నాస్తి తృష్ణాసమో వ్యాధిః, న చ ధర్మో దయాపరః.
గీ. క్షాంతి తుల్యమౌ తపమెన్న కానరాదు.
సంతసముకన్న సుఖము లేదెంతకునిల.
ఆశకన్నను రోగమీ యవని లేదు.
దయను మించిన ధర్మంబు తలప లేదు.
భావము. క్షమతో సమానమైన తపస్సులేదు. సంతోషాన్ని మించిన సుఖంలేదు. అత్యాశతో సమమైన రోగం లేదు.దయను మించిన ధర్మంలేదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమె అన్నీ అక్షర సత్యములె . చక్కగా చెప్పారు మేలిమి బంగారం కదా మన సంస్కృతి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.