గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2017, మంగళవారం

వందే మాతరమ్. భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

 జైశ్రీరామ్.
 వందే మాతరమ్.
ఆర్యులారా! నేడు మన భారతాంబకు పరపాలనా శృంఖలా విముక్తి లభించిన పరమ పవిత్రమైన రోజు. ఈ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భముగా యావన్మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియఁ జేసుకొంటున్నాను.
మహనీయులైన మన పూర్వీకుల ధన మాన ప్రాణ త్యాగ ఫలంగా అతి కష్టంమీద సాధించినదీ స్వాతంత్ర్యము. మనకు లభించిన ఈ స్వాతమ్త్ర్యాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించి దీనిని నిలుపుకొనుచు, మనము స్వేచ్ఛగా జీవించుచు మన భావి తరములవారికి ఈ స్వేచ్ఛా భారతిని స్వచ్ఛమైన భారతిని సుసంపన్న భారతిగా తీర్చి దిద్ది,అందించ వలసిన బాధ్యత మనపై యున్నందున ప్రతీ భారతీయుఁడు తమ విధినిర్వహనలో అప్రమత్తంగా ఉంటూ, ప్రపంచంలో భారతీయులు సగర్వంగా జీవించే సన్మార్గాలను నిర్మించాలి.నేను సహితం అంటూ ప్రతీ ఒక్కరు దేశభక్తితో అభివృద్ధిపథమున గమింతురని మనసారా నమ్ముతూ, వేడుకొనుచున్నాను.
జైభారతమాతా!
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు మరియు బ్లాగు వీక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవము సందర్భముగా హృదయపూర్వక శుభాకాంక్షలు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

న్మస్కారములు
చింతా సోదరులకు సాహితీ మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.