గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2017, శుక్రవారం

వాగ్వాదమ్, అర్థసంబంధమ్, . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. వాగ్వాదమ్,  అర్థసంబంధమ్,  పరోక్షే దారభాషణమ్, 
యత్ర మిత్రత్వమిచ్ఛంతి తత్ర త్రీణి న కారయేత్.
గీ. వాదనము చేయ తగదు సంభాషణముల,
అర్థ సంబంధ మును వీడి, అతని పత్ని
తోడ చాటుగా భాషణల్ వీడవలయు
మైత్రి కోరెడి వారితో ధాత్రిఁ జనులు.
భావము.“ఎక్కడ స్నేహమును కోరుకొందుమో అక్కడ వాగ్వాదము, ఆర్థిక సంబంధ్ము, మిత్రుని పరోక్షములో అతని భార్యతో మాటలాడుట అనే మూడూ చేయరాదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా మంచి విషయాలను అందించారు ధన్య వాదనులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.