జైశ్రీరామ్.
శ్లో. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
క.జరయును, మరణము లేనటు
ధర విద్యా ధనములందెదరు కనఁ బ్రాజ్ఞుల్.
మరణము దరి కొనినటులుగ
చరియింతురు ధర్మములనుసరణీయమెదే.
భావము. ప్రాజ్ఞుడు తనకు ముసలితనము, మరణము లేవనే ఆలోచనతో - విద్యను, ధనాన్ని సంపాదించాలి. మృత్యువు తన జుట్టుపట్టుకొని తీసుకు పోవటానికి సిద్ధంగా ఉందనే ఆలోచనతో ధర్మాన్ని ఆచరించాలి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
మంచి విషయాలను తెలియజేసి నందులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.