జైశ్రీరామ్.
మాధురీ.నుతవరదా.గర్భ కురువరదాలవృత్తము.
రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
కురువరదాలవృత్తము.
కురు వరదంబులు భువి గురు సాయివౌదు వీవయ కొలుతురు కూర్మి నిన్నున్
చరితను నిలిచెదవిల సరిరారు నీకు నెవ్వరు చలితము జీవ సారం
పరితపనేలను విను పరమార్ధ మెంచునిన్నును వలదిక స్వార్ధ చింతల్
కరివరదుంగనుమది కరువొంద.నేరదెన్నడు కలితపనంబు తీరున్.
1.కురు వరదంబులు భువి
చరితను నిల్చెదవిల
పరితప నేలను విను
కివరదుం గను మది
2.గురు సాయివౌదు వీవయ
సరిరారు నీకు నెవ్వరు
పరమార్ధ మెంచు నిన్నును
కరువొంద నేర దెన్నడు.
3.కొలుతురు కూర్మి నిన్నున్
చలితము జీవ సారం
వలదిక స్వార్ధ చింతన
కలి తపనంబు తీరున్.
4.కురు వరదంబులు భువి గురు సాయి వౌదు వీవయ
చరితను నిలిచెదవిల సరిరారు నీకు నెవ్వరు
పరితపనేలను విను పరమార్ధ మెంచు నిన్నున్
కరివరదుంగను మది కరువొంద నేరదెన్నడు.
5 .గురు సాయి వౌదు వీవయ కొలుతురు కూర్మి నిన్నున్
సరిరారు నీకు నెవ్వరు చలితము జీవ సారం
పరమార్ధమెంచు నిన్నును వలదిక స్వార్ధ చింతల్
కరువొంద నేరదెన్నడు కలితపనంబు తీరున్.
6.గురు సాయి వౌదు వీవయ కొలుతురు కూర్మి నినున్ కురువరంబులుభువి
సరిరారు నీకు నెవ్వరు చలితము జీవ సారం చరితను నిల్చెదవిల
పరమార్ధ మెంచు నిన్నును వలదిక స్వార్ధ చింతల్ పరితప నేలను విను
కరువొంద నేర దెన్నడు కలితపనంబు తీరున్ కరి వరదుం గనుమది.
7.కొలుతురు కూర్మి నిన్నున్ కురు వరదంబులు భువి
చలితము జీవ సారం చరితను నిల్చెద విల
వలదిక స్వార్ధ చింతల్ పరితప నేలను విను
కలితపనంబు తీరున్ కరివరదుంగను మది.
8.కొలుతురు కూర్మి నిన్నున్ కురువరదంబులు భువి గురు సాయివౌదువీవ
చలితము జీవసారం చరితను నిల్చెదవిల సరిరారు నీకునెవ్వరు
వలదిక స్వార్ధ చింతల్ పరితపనేలను విను పరమార్ధమెంచు నిన్నును
కలితపనంబు తీరున్ కరివరదుంగను మది కరువొంద నేరదెన్నడు.
9.గురు సాయివౌదు వీవయ కురు వరదంబులు భువి
సరిరారు నీకునెవ్వరు చరితను నిల్చెదవిల
పరమార్ధ మెంచు నిన్నును పరితప నేలను
కరువొంద నేరదెన్నడు కరివరదుంగను మది
10.గురుసాయి వౌదువీవయ కురువరదంబులు భువి కొలుతురు కూర్మినిున్
సరిరారునీకు నెవ్వరు చరితను నిల్చెదవిల చలితము జీవసారం
పరమార్ధమెంచు నిన్నును పరితపనేలనువిను వలదిక స్వార్ధ చింతల్
కరువొంద నేరదెన్నడు కరివరదుంగనుమది కలితపనంబు తీరున్.
కురువరదాలు ఉత్కృతి న.జ.న.స.జ.భ.న.జ.గగ.యతులు10.19.
1.తెల్వరి బృహతీ న.జ.న.వృ.సం.496.
2.కందళీ బృహతీ .వృ.సం.428.స.జ.భ.
3.భువనా.అనుష్టుప్. న.జ.గగ.వృ.సం.48.
4.నుతజని ధృతి న.జ.న.స.జ.భ.యతి.10.
5.సుజనీ అత్యష్టీ.స.జ.భ.న.జ.గగ.యతి.10.
6.సజావు.ఉత్కృతి.స.జ.భ.న.జ.త.న. భ.లల.యతులు.10.18.
7.జతినుత.అత్యష్టీ న.జ.త.న.భ.లల.యతి.9
8.కూర్మిలు.ఉత్కృతి న.జ.త.న.భ.న.జ.ర.లల.యతులు 9.18.
9.మాధురీ ధృతి.స.జ.భ.న.జ.న.యతి10.
10.నుతవరద ఉత్కృతి స.జ.భ.న.జ.న.న.జ.గగ.యతులు .10.19.
జైహింద్.
1 comments:
నమస్కారములు
గౌరవనీయు లైన శ్రీ వల్లభవఝుల వారి నూతన ఛందములు అలరించు చున్నవి . ఇలా ఎన్నో మరెన్నెన్నో అద్భుత వృత్తములను మాకందించ గలరని మనవి. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.