జై శ్రీరామ్.
అభిమాన ధనుఁడైన అంజయ్య అవధాని శుభ చిత్ర తతిఁ జూచి శుభముఁ గనుఁడు.
ఋషి పుంగవులచేత నసదృశ రీతిలో సత్కృతుల్ గొన్నట్టి సరసుఁడితఁడు,
విషయవాంఛలు లేని విజ్ఞాన ఖనియును, విజ్జాన ధనుఁడైన వినుత మూర్తి.
శిశువుల మన్నించి శిష్యులుగాఁ గొని విద్యను నేర్పెడి వినుత శీలి.
అట్టి అంజయ్య యవధాని గట్టివాడు. - పట్టి గాంచినన్ గనిపించు పట్టు మనకు.
ఉట్టికుట్టినే తెలియడు. ఘట్టికృష్ణ - ప్రస్తుతించిన వాటికి ప్రతిగ నిలిచె.
జైహింద్.
1 comments:
namaskaaramulu
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారములను చిత్రములతో అందించినందులకు కృతజ్ఞతలు.అవధాన సరస్వతులకు మాన్యులకు ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.