జైశ్రీరామ్.
శ్లో. మృదులం నవనీతమీరితం నవనీతాదపి సజ్జనస్యహృత్తదిదం ద్రవతి స్వతాపనాత్ పరతాపాద్రవతే సతాం పునః
ఆ.వె. మృదుల మిలను వెన్న, మృదులంబు హృదయంబు
సతము వెన్న కన్న సజ్జనునకు,
వెన్న తనకు తా నెన్నఁడు కరుగదు.
కరుగు మంచి మనసు కష్టముఁ గని.
భావము.. నవనీతం అంటే వెన్న, వెన్న అన్నిటికంటే మృదువైన పదార్థం అంటారు. కానీ నవనీతంకన్నా కూడా సజ్జనుల హృదయం మృదువైనదట. ఎందుకంటే వెన్న స్వతాపనాత్ ద్రవతే, తనని తాను వేడి చేస్తే కానీ కరగదు. కానీ సజ్జనహృదయం పరతాపా ద్రవతే అంటే పరుల తాపాల కి కూడా కరిగిపోతుందట. ఇక్కడ తాపం, వేడి అంటే కష్టం అని చూడండి వెన్న కరగాలంటే అది కష్టం అనుభవించాలి కానీ తన మృదుత్వం వలన చిటికెలో కరిగి పోతుంది. మరి సజ్జనులు ఎదుటివారి కష్టాలకి కూడా మళ్ళీ మళ్ళీ కరిగి పోతారు. ఇలా ఎదుటివారిని కష్టాలలో చూసి ఓర్వలేక తమ జీవితం ధారపోసిన మహానుభావులెందరో అందరికీ వందనములు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
నిజమే మన సంస్కృతి మేలిమి బంగారమే చక్కని శ్లోకాన్ని అందించి నందులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.