గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మే 2016, ఆదివారం

తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తమ అవధానిగా కీర్తి పురస్కార గ్రహీత అయిన శ్రీ మలుగ అంజయ్యకు అభినందనలు.

 జై శ్రీరామ్.
అభిమాన ధనుఁడైన అంజయ్య అవధాని శుభ చిత్ర తతిఁ జూచి శుభముఁ గనుఁడు.
ఋషి పుంగవులచేత నసదృశ రీతిలో సత్కృతుల్ గొన్నట్టి సరసుఁడితఁడు,
విషయవాంఛలు లేని విజ్ఞాన ఖనియును, విజ్జాన ధనుఁడైన వినుత మూర్తి.
శిశువుల మన్నించి శిష్యులుగాఁ గొని విద్యను నేర్పెడి వినుత శీలి.
అట్టి అంజయ్య యవధాని గట్టివాడు. - పట్టి గాంచినన్ గనిపించు పట్టు మనకు.
ఉట్టికుట్టినే తెలియడు. ఘట్టికృష్ణ - ప్రస్తుతించిన వాటికి ప్రతిగ నిలిచె.


జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

namaskaaramulu
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారములను చిత్రములతో అందించినందులకు కృతజ్ఞతలు.అవధాన సరస్వతులకు మాన్యులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.