గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మే 2016, గురువారం

శ్రీరామాయణ పారాయణ భౌతిక ఫలితముల పట్టిక . . .శ్రీజమ్మలమడక శ్రీనివాసు

జైశ్రీరామ్.
శ్రీరామాయణ పారాయణ భౌతిక ఫలితముల పట్టిక
శ్రీరామాయణము ప్రతి మానవుడు చదవవలసిన ఉత్తమ పురాణగ్రంథము. వాల్మీకి మహర్షి శ్రీరామాయణము సర్గలలో బీజాక్షరములు నిక్షిప్తము చేయడమే కాకుండా, ఆయా సర్గలను అమోఘ ఫలితములనిచ్చే మంత్రములుగా సిద్ధిచేశారు. కావున భౌతిక ఫలితములు ఆశించువారికి ఈ పట్టిక ఉపయోగపడగలదు. శ్రీసీతారామకళ్యాణ మహోత్సవములు జరుగునప్పుడు ఈ పట్టిక వితరణ చేయుట సాంప్రదాయము.
వరుస సంఖ్య. /సంకల్పిత కార్యము /కాండము పారయణసర్గలు /పారయణఘట్టము పేరు /పారాయణ చేయవలసిన కాలము /నివేదన వస్తువులు
1. / ధర్మకార్యములు సిధ్ధించుటకై / అయోధ్య 21-25 / కౌసల్యారామ సంవాదము / ఉదయము లేదా మధ్యాహ్నము / 5 అరటి పళ్ళు
2. / ధనలాభమునకై / అయోధ్య 32 / యాత్రాదానము / మూడుపూటలు / 5 అరటి పళ్ళు
3. / వివాహము జరుగుటకై / బాల 73 / సీతాకల్యాణము / ఉదయము / అప్పుడేపిదికిన పాలు
4. / మోక్షప్రాప్తికై / అరణ్య 65-68 / జటాయుమోక్షము / ఉదయము / 5 అరటిపళ్ళు
5. / సకలరోగశాంతికై / యుధ్ధ 59 / రావణ కిరీట భంగము / ఉదయము 2సార్లు / ప్రారంభంలో తేనె, సమాప్తిలో పాలు
6. / భూతపిశాచబాధనివృత్తికై / సుందర 3 / లంకావిజయము / సాయంకాలము / ప్రారంభంలో చెక్కరపొంగలి
7. / చిత్తభ్రమతొలగుటకై / సుందర 13 / మారుతినిర్వేదం / ఉదయము / మినుములపొడి కలిపిన అన్నము
8. / దారిద్ర్యనివృత్తికై / సుందర 15 / హనుమత్కృతసీతాదర్శనము / ఉదయము / 5 అరటిపళ్ళు
9. / సకలదుఖఃనివృత్తికై / యుధ్ధ 116 / సీతాంజనేయసంవాదము / ఉదయము / 5 అరటిపళ్ళు
10. / ఆపదవారణకై / యుధ్ధ 18-19 / విభీషణసంగ్రహము / ఉదయము / ఆద్యంతములలో టెంకాయ
11. / బంధువు స్వస్థానం చేరుటకై / సుందర 36 / అంగుళీయ ప్రదానము / ఉదయము-సాయంత్రము / ఆద్యంతములలో పనసపండు మామిడిపండు
12. / దుస్స్వప్నదోషశాంతికై / సుందర 27 / త్రిజటాస్వప్నము / ఉదయము 3 రోజులు / పంచదార
13. / శ్రీరామపచారదోషశాంతికై / సుందర 38 / కాకానుగ్రహము / ఉదయము 5 అరటిపళ్ళు
14. / జన్మాంతరసకలసౌఖ్యప్రాప్తికై / యుధ్ధ 131 / శ్రీరామపట్టభిషేకము / ఉదయము 1నెల / పెసరపప్పు చేర్చిన ఉప్పు పొంగలి
15. / పుత్రసంతానప్రాప్తికై /బాల 15-16 పుత్రకామేష్టి / ఉదయము 20రోజులు / నెయ్యికలిపిన పాయసము
16. / సుఖప్రసవము / బాల 18 / శ్రీరామావతారము గర్భిణికి వినపడునట్లు / ఆసమయమునకు దొరికినవస్తువు
17. / కారాగృహభయనివృత్తికై / యుధ్ధ 117 / సీతానయనము ఉదయము / ఏదైన మధుర వస్తువు
18. / సంతానమునకు సద్బుధ్ధి కలుగుటకు / అయోధ్య 1-2 / శ్రీరమగుణవర్ణనము / ఉదయము / 5 అరటిపళ్ళు
19. / సకలాభీష్టకార్యసిధ్ధికై / బాల 75-76 / భార్గవవిజయము / ఉదయము / పాయసము అప్పములు
20. / రాజద్వారమున సర్వానుకూలసిధ్ధికై / అయోధ్య 100 / శ్రీరమునిచే భరతునికి రాజధర్మోపదేశము / ఉదయము / 5 అరటిపళ్ళు
ఈ పారాయణము రాముల వారికి షోడశోపచారపూజ చేసి, చేయవలెను. పారాయణము అయిన తరువాత పా యణపుస్తకమునకు కూడా పూజ చేయవలెను.
ఇట్లు
శ్రేయస్కాముడు,
జమ్మలమడక శ్రీనివాసు.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ రామాయణమును పారాయణ జేయుటవలన కలుగు ఫలితములను వరుసక్రమమున అందించిన శ్రీ జమ్మలమడక శ్రీనివాసు గారికి కృతజ్ఞతలు .మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.