గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2016, సోమవారం

పిచ్చుక మది నేమున్నది?గద్యమో . . . పద్యమో . . . గేయమో అందించేది మీరు,

జైశ్రీరామ్

ఆర్యులారా! ఈ పిచ్చుక మదిలో ఏముందో అనే విషయం దృష్టికి తెచ్చుకొని, మీ భావనామృతాన్ని మీ కవితామృతంతో జోడించి పాఠకులనానందపరవశులను చెయ్యండి.
గద్యమో . . . పద్యమో . . . గేయమో  
అందించేది మీరు, 
ఆనందించేది పాఠకులు. నమస్తే.
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అటినిటు నెటుజూ చినమరి
కటువుగ నున్నది తినుటకు కానవు గింజల్
కటకట కరువే జగతిని
పుటుకన బట్టంగ నొక్క పురుగే లేదే

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చక్కని భావన. పిచ్చుక
నిక్కమ్ముగనట్టులే గణించును. జగతిన్
దిక్కన్నది లేక తినగ
యిక్కట్టులు పడుచునుండె నిది నిజమక్కా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధన్య వాదములు సోదరా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.