జైశ్రీరామ్.
శ్లో. జకారో జన్మ విచ్ఛేదః - పకారో పాప నాశన:.జన్మ చ్ఛేద కరో యస్మాత్పమిత్యభిదీయతే.
గీ. జన్మ రాహిత్యమగునుజ, సకల మైన
పాప సంహారమగునుప, పట్టు పట్టి
జపము భక్తిగ చేసిన జన్మ లేమి
మనకు ప్రాప్తించు. చేయుడు మనుజులార!
భావము. జ అనగా జన్మ రాహిత్యము. ప అనగా పాప నాశనము. జపముము అనగా పాపము నశింపఁ జేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది.
కావున జపము చేయునప్పుడు మంత్రమునందు మనస్సు నిలిపి, తద్భావమును తలపోయుచు, జపము చేసినచో భావ పరిపుష్టితో పాటు జప పరిపుష్టి కూడా ప్రాప్తించి, మంత్ర సిద్ధి కలుగును.
జైహింద్.
1 comments:
నమస్కారములు
మంచి శ్లోకాన్ని అందించారు. నిజంగా మనసంస్కృతి మేలిమి బంగారమె ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.