జైశ్రీరామ్.
శ్లో. రాజా రాష్ట్ర కృతం పాపం! - రాజపాపం పురోహితః!భర్తా చ స్త్రీకృతం పాపం! - శిష్యపాపం గురుర్వ్రజేత్!! (భోజచరితమ్)
గీ. ప్రజల పాపంబు రాజుకు ప్రాప్తమగును.
రాజు పాపంబు గురువుకు ప్రాప్తమగును.
స్త్రీల పాపంబు భర్తలఁ జేరుచుండు
శిష్య పాపంబు గురువులఁ జేరు నిజము.
భావము. రాష్ట్రములోని ప్రజలు చేయు పాపములు రాజును పొందును; రాజు గావించు పాపములు పురోహితుని పొందును, స్త్రీలు చేయు పాపములను భర్తలకు సంక్రమించును. శిష్యుల పాపములు గురువునకు సంక్రమించును. అనగా రాజు ప్రజలను,పురోహితుడు రాజును,భర్త భార్యను, గురువు శిష్యులను, మంచిమార్గమున నడచుకొనునట్లు చూడవలసిన బాధ్యత గలవారని భావము.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును ఎవరు మంచిమార్గము నందు లేకున్నను దోషము బాధ్యత గలిగిన మరియొకరికి లభించును .మంచి శ్లోకము .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.