జైశ్రీరామ్.
మంత్రము. సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా
యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్. (ముండకోపనిషత్ 3.1.6)
క. సత్యమె జయమును పొందున
సత్యము జయమొందఁబోదు.సత్య సుమార్గౌ
న్నత్యము దివ్యులెఱుకయి,
సత్య పథంబున శుభంబు సతతము కోరున్
భావము. సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును ఎప్పడికైనా అసత్యము నిలువదు .సత్యమే ధర్మ మార్గము .నిజంగా మనసంస్కృతి మేలిమి బంగారమె .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.