జైశ్రీరామ్.
శ్లో.నమోస్తు రామాయ సలక్షణాయ,దేవ్యైచ తస్యై జనకాత్మజాయై,
నమోస్తు రుద్రేన్ద్రయమానిలేభ్యో,
నమోస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః.
ఉ.వందనమాచరింతు రఘువంశ సలక్ష్మణ రామ మూర్తికిన్.
వందనమాచరింతు జనవందిత శ్రీ జనకాత్మజాంబకున్.
వందన మింద్ర, వాయు, యమ, భాస్కర, చంద్ర, మరుత్గణంబుకున్.
వందన మాచరింతు గురు వర్యులు వేంకటరాఘవార్యకున్.
భావము. లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారము, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారము, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారము, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారము. గురుశ్రేష్టులై మాగురుదేవులు శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారికి నమస్కారము చేయుచున్నాను..
జైహింద్.
2 comments:
నమస్కారములు
చాలా మంచి శ్లోకం బాగుంది
శ్లోకము తెలిసినదే ఐనా భావముతో సహా అందించి నందులకు శ్రీ చింతా వారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.