జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల నరసింహమూర్తి కవి కృత సప్తస్వర కందమును తిలకించండి.
ఇందు కేవలము స, రి, గ, మ, ప, ధ, ని, అను సప్త స్వరములు మాత్రమే వాడబడినవని గమనించగలరు.
సప్తస్వర కందము:-
సరిసరి నీసరి సరిగమ
సరిరా గమపదనిస సరి సారధి గనుమా
మురరిపు గురుపద, మగసరి
సరి, సిరిపరమున్-గిరిధరు, సరసపు మగనిన్
భావము:- రసవత్తర ప్రభుడు, గిరిధరుడు, లక్ష్మీదేవి యొక్క పరముడునగు, శ్రీమహావిష్ణువునకు సరిగా గమియించు వాడుగాని, సారధ్యము వహించువాడు గాని, ఆ మగసరియగు మురరిపుడు,గిరిధరుడు మాత్రమే. అనగా తనకు తానే సాటి; వేరొకరు తనకి సరిపడరని భావము. సరిగమపదని-యను సప్త స్వరములను తీసికొని వ్రాయబడినది.
జైహింద్.
1 comments:
ప్రణామములు
శ్రీ వల్లభవఝుల వారి కృతము వర్ణింప నావంటి అల్పులకు సాధ్యమేనా ? " సప్తస్వరముల కంద మకరందము " గ్రోలి తరించ వలసినదే మరి .చాలా బాగుంది అసలిలా వ్రాయ వచ్చునను ఊహకూడా తెలియని దానను .చదవ గలగడం నా అదృష్టం ధన్య వాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.