జైశ్రీరామ్.
శ్లో. యథా వ్యాళ గళస్థో -పి , భేకో దంశానపేక్షతే
తథా కాలాహినా గ్రస్తః , జనో భోగానశాశ్వతాన్.
గీ. వ్యాళ గళమందు చిక్కిన వేళ కూడ
తథా కాలాహినా గ్రస్తః , జనో భోగానశాశ్వతాన్.
గీ. వ్యాళ గళమందు చిక్కిన వేళ కూడ
కప్ప యీగనుతినఁగోరి
విప్పు నోరు.
కాలసర్పంబు పట్టిన వేళ కూడ
భోగములకాశ చేతుము బుద్ధి
లేక
భావము. పాము నోటికి చిక్కి తాను చనిపోయే దశలోకూడా , కప్ప -ఈగలను
పట్టి తినాలని ఆశపడుతుంది. అలాగే
కాలమనే సర్పం
చే మ్రింగబడుతూ కూడా మనము అశాశ్వత భోగాలను కోరుకుంటున్నాము.
జైహింద్
3 comments:
నమస్కారములు
అవును మనిషి మరణ సమయమందు కుడా భోగ భాగ్యములను విషయ సౌఖ్యములను గురించి వాపోతాడె గాని దైవ చింతన ఉండనే ఉండదు
మేలిమికి మేలిమి బంగార మైన మంచి సూక్తిని వివరించారు ధన్య వాదములు
ఈ మధ్య పది రోజులుగా జ్వరంగా ఉండటం వలన మేలిమి వంటి బంగారు బ్లాగును చూడ లేకపోయి నందుకు చింతిస్తున్నాను
అమ్మా! నమస్తే.మీకు జ్వరమా? తగ్గిందామ్మా? మీ వంటి సహృదయులన్నమాబోట్లకే ఇష్టం అనుకున్నాను. జ్వరాది అరివర్గానికి కూడా మీరంటే ఇషటముండడం ఎంతవింత? మీకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను.
మీ కవితా జయ దుందుభుల మ్రోతతో జయ విజయం చేయాలని ఆశిస్తోందమ్మా. తప్పక మంచి కవితలు వ్రాసి జయకు స్వాగతం పలకండి.మీకు జయ ఉగాది సందర్భముగా శుభాకాంక్షలమ్మా. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా ఈ జయ నామ సంవత్సరంలో ఉండాలని మనసారా కోరుకొంటున్నానమ్మా.
నమస్తే.
ధన్య వాదములు
తమ్ముడూ మీ అందరి ఆదరాభి మానములే నాకు ఊపిరి .ఇప్పుడు బాగుంది
మీకు మరదలికి పిల్లలకి మనవలకి అందరికి జయ నామసంవత్సర యుగాది శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.