జైశ్రీరాం.
శ్లో. దర్శనే స్పర్శనే వాపి శ్రవణే
భాషణేపివా
యత్ర ద్రవత్యంతరంగం , సస్నేహఇతి
కథ్యతే .
క. స్నేహితులను చూచునపుడు
స్నేహితుల
స్పృసించునపుడు, స్నేహితు పల్కుల్
స్నేహమున విని పలుకునెడ
స్నేహితుమది యార్ద్రమగును.
స్నేహంబదియే..
భావము. చూచుటయందు, స్పృశించుటయందు, వినుటయందు,భాషణమునందు ఎక్కడ మనస్సు
ఆర్ద్రమవుతుందో అది స్నేహమని చెప్పబడుతుంది.
జైహింద్
1 comments:
నమస్కారములు
అవును అందరితోటీ స్నేహం చేయలేము . మంచి మాట , మంచి అవగాహన , ముఖ్యంగా మంచి మనస్సుతో అర్ధం చేసుకున్నవా రైతేనె స్నేహం చేయగలం బాగుంది చక్కని సూక్తి .అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.