గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మార్చి 2014, ఆదివారం

బంధమోచన కర్తా తు స్వస్మాదన్యో న కశ్చన. - మేలిమి బంగారం మన సంస్కృతి 164.

                                                             జైశ్రీరామ్.
శ్లో. ఋణమోచన కర్తారః పితుస్సంతి సుతాదయః
బంధమోచన కర్తా తు స్వస్మాదన్యో న కశ్చన.
గీ. తండ్రి ఋణ ముక్తుఁ జేయును తనయుడిలను.
భువిని సంసార బంధ విముక్తి పొంద
నెవరి యత్నము వారలే భవుని కృపను
కలిగి చేయక తప్పదు. కాంచుడయ్య.
భావము. తండ్రిని ఋణవిముక్తుణ్ణి చేయటానికి కుమారులు మొదలైన వారుంటారు. కానీ సంసార బంధవిముక్తులు కావాలంటే ఎవరికి వారే కర్తలు తప్ప వేరొకరుకాదు.

జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.