జైశ్రీరామ్.
శ్లో. శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన , దానేన
పాణిర్నతు కంకణేన
విభాతి కాయః కరుణాపరాణాం , పరోపకారై ర్నతు చందనేన.
విభాతి కాయః కరుణాపరాణాం , పరోపకారై ర్నతు చందనేన.
గీ. మంచివినుటను,చేయంగ
మంచిదాన
మెంచి పరమోపకారమునెపుడు
వెలయు
నెందు కుండల,కంకణ, చందనములఁ
గాదు కర్ణకరవపువుల్
ఘనులకిలను.
భావము. దయాస్వభావం కలవారి చెవులు జ్ఞానవిషయాలు వినటం వల్ల
రాణిస్తాయి గానీ , కుండలాలతో కాదు! చేతులు దానంతో
ప్రకాశిస్తాయేగానీ , కంకణాలతో కాదు! శరీరం పరోపకారంతోనే
ప్రకాశిస్తుందిగానీ , గంధపు పూతతో కాదు!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.