జైశ్రీరామ్.
శ్లో. సాధోః ప్రకోపితస్యాపి మనో నాయాతి విక్రియాం
న హి తాపయితుం శక్యం సాగరాంభః తృణోల్కయా.
గీ. సాధువులకోపమప్పుడే సమసిపోవు.
మదిని నిలువదు. శాంతియే మదిని కుదురు.
సాగరాంబువు నెవరైన శక్తి చూపి
గడ్డిమంటనుపెట్టుచు కాచనగునె?
భావము. సజ్జనులు
కొన్నిసందర్భాల్లో కోపించినా వారి మనస్సు లు మాత్రం ఏ వికారమూ చెందవు. సముద్రజలాన్ని
గడ్డిమంటతో కాచటం సాధ్యంకాదు కదా.
జైహింద్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.