జైశ్రీరాం.
శ్లో. ఆత్మాపరాధ
వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం
దారిద్ర్య దుఃఖ రోగాణి బంధన వ్యసనాని చ.
దారిద్ర్య దుఃఖ రోగాణి బంధన వ్యసనాని చ.
గీ. దేహికపరాధతరులబ్ధ దీన
ఫలము
లిలను దారిద్ర్య దుఃఖములేల్చు
రోగ
బంధనములువ్యసనములుబాధఁ
గొలుపు.
దేహి యపరాధ దూరుడై తిరుగ
వలయు.
భావము. జీవులయొక్క "స్వయం కృతాపరాధం" అనే వృక్షానికి - దారిద్ర్యం,దుఃఖం , రోగాలు , బంధన ప్రాప్తి , వ్యసనాలు అనేవి ఫలాలు.
జైహింద్
2 comments:
శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...
చాలా మంచి విషయము గురువుగారు, జనులు స్వయం కృతాపరాధం తోడన్ని రోగములు "కొని" దెచ్చు కుంటున్నారు. ఆపై వ్యసనములు సరేసరి..
మన విశిష్ట సంస్కృతిలోని మర్మములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాద శతము.
నమస్కారములు
అవును తెలిసి తెలిసి చేసే పనులకు నిష్కృతి లేదు .చేతులు కాలాక ఆకులు పట్టు కోవడమే . చక్కని విషయాన్ని చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.