గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఫిబ్రవరి 2014, బుధవారం

విష్ణుర్జయతి నాసురః. మేలిమి బంగారం మన సంస్కృతి. 156.

జైశ్రీరాం
శ్లోధర్మో జయతి నాధర్మః , సత్యం జయతి నానృతం
క్షమా జయతి న క్రోధో, విష్ణుర్జయతి నాసురః.
గీ. ధర్మముజయించు నోడు నధర్మమెపుడు
సత్యముజయించు నోడునసత్యమెపుడు
క్షమ జయించును క్రోధము కాదు జగతి.
విష్ణుఁడు జయించునసురుల వినుతగతిని.

భావము. ధర్మమే జయిస్తుంది , అధర్మం కాదు. సత్యం జయిస్తుంది ,అసత్యం కాదు. క్షమ జయిస్తుంది , క్రోధం కాదు, విష్ణువు జయిస్తాడు , రాక్షసుడు కాదు.
జైహింద్
Print this post

3 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

చాలా మంచి విషయము తెలియ జేసితిరి. అధర్మపు గెలుపు శాశ్వతం కాదు, అటులనే అసత్యము మరియు క్రోధము.
మీకు నా ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమె ధర్మా ధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించడం శ్రేయస్కరం కాదు మంచి విషయాన్ని అందించారు ధన్య వాదనులు

Pandita Nemani చెప్పారు...

జయించు ధర్మమెప్పుడున్ జయించలే దధర్మమే
జయించు సత్యమే భువిన్ జయించలే దసత్యమే
జయించు నోర్పు మాత్రమే జయించలేదు క్రోధమే
జయించు విష్ణుమూర్తియే జయించలేరు రాక్షసుల్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.