జైశ్రీరామ్.
శ్లో. యేన కేన ప్రకారేణ, యస్య కస్యాపి దేహినఃసంతోషం జనయేత్ప్రాజ్ఞః తదేవేశ్వర పూజనమ్.
గీ. మార్గ మేదైన, ప్రాణులమంచి చేసి
సంతసముఁ గొల్ప నొప్పును సజ్జనునకు.
ప్రాజ్ఞుఁడొనరించు తత్ పూజ భవ్య మెన్న.
ఈశ్వరార్చనమద్దియే ప్రేమనుగన.
భావము. ప్రాజ్ఞుడైనవాడు ఏదోఒక విధంగా, ఏదో ఒక ప్రాణికి ఒక మంచి పనితోసంతోషం కలిగించాలి. అదే ఈశ్వర పూజ.
జైహింద్
2 comments:
శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...
నేటి జనులు ఇతరులను కష్ట బెట్టడమే కాని, సంతోష పెట్టుట కష్టమే ... గురువుగారు
నమస్కారములు
అసలీ రోజుల్లోఎదుటి వ్యక్తిని ఎలా బాధించి ఆనందించాలా అనుకునేవారె ఎక్కువ ఇక సంతోష పెట్టడం అంటే మరొక యుగం రావాలి .మంచి విషయాలను అందిస్తున్న శ్రీ చింతా వారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.