గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఛిద్ర మాసాద్య, దోషశ్చిత్తే ప్రసర్పతి. మేలిమి బంగారం మన సంస్కృతి. 155.

జైశ్రీరామ్.
శ్లో. విషం రుధిర మాసాద్య, ప్రసర్పతి యథా తనౌ
తథైవ ఛిద్ర మాసాద్య, దోషశ్చిత్తే ప్రసర్పతి
.   
క. నెత్తురు వెంబడి విషమటు
లెత్తరి బలహీనతఁ గొని జ్యేష్ఠోద్భవముల్
మత్తును గొలుపుచు మది నిలు.
మత్తగు బలహీనత విడి మసలుఁడు మహితుల్.        
భావము. రక్తాన్ని ఆధారంగా చేసికొని విషం ఏరీతిగా శరీరమంతటాప్రసరిస్తుందో , అలాగే ఒక్క బలహీనతను సాధనంగా చేసికొనిదుష్టసంస్కారం మనస్సులో వ్యాపిస్తుంది.
జైహింద్
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

చాలా మంచి తత్వము తెలియ జేసారు, కనుక మనుజుడు బలహీనుడు(బుద్ధి హీనుడు) కాకుండు నటుల ప్రవర్తించ వలెను.

మీకు నా ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే ఒక బలహీనతని ఆధారంగా తీసుకొని ఆ వ్యక్తిని చివరి వరకు సాధించడం అమానుషం
చక్కని విషయాలను చెప్పారు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.