జైశ్రీరామ్.
శ్లో. ఇచ్ఛతి శతీ సహస్రం, సహస్రీ లక్షమీహతేలక్షాధిపస్తథా రాజ్యం, రాజ్యస్థః స్వర్గమీహతే.
గీ. నూరు కలవాడు వేయిని కోరుచుండు.
వేయికలవాడు లక్షల వేలు కోరు.
లక్ష కలవాడు రాజ్యసల్లక్మిఁో్ గోరు.
రాజ్యవంతుఁడు స్వర్గసామ్రాజ్యమడుగు
భావము. వంద ఉన్నవాడు వెయ్యి కోరుకుంటాడు. వెయ్యి ఉన్నవాడు లక్షకావాలంటాడు. లక్షాధికారి రాజ్యంకావాలంటాడు. రాజు స్వర్గంకోరుతాడు.(ఆశకు హద్దు లేదు).
జైహింద్
2 comments:
శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...
చాలా మంచి విషయము తెలియ జేసారు, ఆశకు హద్దు లేని యడల నది దురాశ యగును, దురాశ దుఃఖమ్ము కలిగించు. లోకుల కొరకు భీష్ముడు చాల మంచి విషయములు తెలిపెను, వాటిని కూడా వీలు జూచి ప్రకటించగలరు.
నమస్కారములు
నిజమే ఆశకు అంతే లేదు ఉన్నదాంట్లో తృప్తి అంతకంటే ఉండదు ఇదే మానవ నైజం చక్కటి పద్యాన్ని అందించారు
అనగ ననగ రాగ మతిసయిల్లు అన్నట్టు చదవ గా చదవగా కొందరైనా మారితే ముందు తరం వారైనా సుఖ పడగలరు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.