జైశ్రీరామ్.
ఆర్యులారా! చిత్రకవితాప్రవీణులారా! ముఖే ముఖే సరస్వతీ అన్నారు ఆర్యులు. మీలో ఎవ్వరి నుండైనా నా కోరిక తీరకపోతుందా అని ఈ విన్నపము చేయుచున్నాను. చిత్ర కవితలో అనేకమైనవి మహనీయ చిత్రకవులు ప్రదర్శించారు. ఐతే జాంబవత్పాద బంధము, విశ్వ ముఖ మత్స్య త్రయ బంధము అనే చిత్ర కవితలవిషయంలో అవి యెలాగుంటాయో, వాటిలో ఉండే వైవిధ్యమేమిటో మీలో ఎవరైనా దయ చేసి నాకు తెలియ పరచ గలరని ఆశిస్తున్నాను. ఒక మహనీయులు ఈ చిత్రములను గూర్చి నన్ను అడిగి యున్నారు.
దయ చేసి చిత్రముతో సహా తెలుప గలిగిరేని మిక్కిలి ఆనంద ప్రదులగుదురని మనవి చేయుచున్నాను.
ఇక ఆ పద్యములను చూడండి.
జాంబవత్ పాద బంధ చిత్రము.
ఉ: రామ సహాస తిర్మల ధరావర. సోమ నృపాత్మ సారసా.
రామ ధరావరావర వరస్తవ నాదరణ ప్రమోద సా
రామల శీల ధర్మ రచితాద్యవతార కృతానవప్రకా
రాముని మానితాదురిత రాజ విభంజక భక్త రంజకా.
విశ్వ ముఖ మత్స్యత్రయ బంధము.
చ: కరి నుత చిద్విలాస. యనఘస్మరఘస్మర మిత్ర బాంధవా.
శరజ విలోచనా విజయ.సత్వరసత్వర తాత్మ శైశవా.
విరచిత శీల రాఘవ రవిగ్రహ విగ్రహ వర్తి మాధవా.
విరళ కథోత్సవా నిఖిల విద్విభవా. జగదీశ కేశవా.
మీ నుండి సత్వర సమాధానమును ఆశించుచున్నాను. నమస్తే.
జైహింద్.