జైశ్రీరామ్.
అందరికి నమస్కారం
పూర్వకాలం లో సాధారణంగా దేవాలయాన్ని , ఎక్కడైతే భూ అయస్కాంత రేఖల తీవ్రత ఎక్కువ ఉంటుందో అక్కడ నిర్మించేవారు. అది ఊరికి మధ్యలోనైన ,చివరిలోనైన, కొండపైనైనా ఎక్కడైనా సరే .
ముఖ్యంగా ఎక్కడైతే విద్యుత్ మరియు అయస్కాంత తరగంగల శక్తి అత్యధికంగా అన్నివైపులా ప్రసరిస్తుందో అక్కడ నిర్మించారు .
ఎక్కడైతే భూ అయస్కాంత తరంగ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ స్థానం లో మూలవిగ్రహాన్ని దానితో పాటు రాగి యంత్రాలను కూడా ప్రతిష్టిస్తారు . రాగి యంత్రాలు భూ అయస్కాంత శక్తిని శోశించుకొని నలుదిశలా వ్యాప్తి చేస్తాయి .
గుళ్ళో చేసే దీపారాధన , మ్రోగించే గంట అర్చకుల వేదమంత్రాలు, కర్పూర హారతి, దూపం, పుష్పాల , సుగంధ ద్రవ్యాల పరిమళాలు ఇవన్ని మనపై ప్రసరించే శక్తిని పెంపొందిస్తాయి.
దేవుడికి అభిషేకం చేయడం వల్ల ఆ అయస్కాంత శక్తి జలంలోనికి ప్రసరిస్తుంది. పచ్చకర్పూరం, కుంకుమపువ్వు , తులసి మొదలగునవి దాని శక్తిని మరింతగా పెంపొందిస్తాయే (magneto therapy). తులసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది . మూడు సార్లు తీర్థాన్ని తీసుకోవడం వల్ల శారీరక రుగ్మతలు దూరమై , ఆరోగ్యాన్ని పొందగలుగుతాం.
పవిత్రమైన అబిషేక జలాని మనపై జల్లడం ద్వారా శక్తి ప్రసారం అవుతుంది. అందుకే మగవారిని వంటిపై చొక్కా వేసుకొని గర్భ గుళ్ళోకి రావోద్దంటారు .
గుళ్ళో చేసే కార్యాలు అందరూ సామూహికంగా చేయడం వల్ల వ్యక్తీ గత బాధలు మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన బాగోగులను ఎంతగానో ఆలోచించే మన పెద్దలు మనకు ఈ నియమ నిబందనలను పెట్టారు . వీలైనన్ని సార్లు దేవాలయాలను సందర్శించుకొందాం. తద్వారా ఎంతో గొప్పనైన మన సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం .
ధన్యవాదాలు
మల్లవజ్జల కిరణ్ కుమార్.
చూచారు కదండీ ఎంత చక్కని వివరణో!
జైహింద్.
4 comments:
విలువైన సమాచారం పంచుకున్నారు. ధన్యవాదములు.
విలువైన సమాచారం పంచుకున్నారు. ధన్యవాదములు.
విలువైన సమాచారం పంచుకున్నారు. ధన్యవాదములు.
దేవాలయ సందర్సన మువలన కలుగు మంచి ఫలితాలను వివరించి నందులకు ధన్య వాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.