గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2012, శనివారం

మనం తరచూ దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి - మల్లవజ్జల కిరణ్ కుమార్

జైశ్రీరామ్.
సోదర భారతీయులారా! దేవాలయ నిర్మణములు చేసేటప్పుడు మన పూర్వీకులకున్న ఆలోచనా సరళి యేమిటో అందలి మహత్తరమైన ఆంతర్యమేమిటో, మగవారు చొక్కా వేసుకోకుండా గుడిలోకి రావాలనే నియమం పెట్టడంలో గల ఆంతర్యమేమితో శ్రీ మల్లవజ్జల కిరణ్ కుమార్ గారు చక్కగా వివరించి వ్రాసారు. మీరూ చదవండి.
అందరికి నమస్కారం 
పూర్వకాలం   లో  సాధారణంగా  దేవాలయాన్ని  , ఎక్కడైతే  భూ  అయస్కాంత  రేఖల  తీవ్రత  ఎక్కువ  ఉంటుందో  అక్కడ  నిర్మించేవారు.  అది  ఊరికి  మధ్యలోనైన ,చివరిలోనైన, కొండపైనైనా  ఎక్కడైనా సరే .
ముఖ్యంగా  ఎక్కడైతే  విద్యుత్   మరియు  అయస్కాంత  తరగంగల  శక్తి   అత్యధికంగా  అన్నివైపులా  ప్రసరిస్తుందో  అక్కడ  నిర్మించారు . 
ఎక్కడైతే  భూ  అయస్కాంత  తరంగ  తీవ్రత  అధికంగా  ఉంటుందో  ఆ  స్థానం  లో  మూలవిగ్రహాన్ని  దానితో  పాటు   రాగి  యంత్రాలను  కూడా  ప్రతిష్టిస్తారు . రాగి  యంత్రాలు  భూ  అయస్కాంత  శక్తిని   శోశించుకొని      నలుదిశలా వ్యాప్తి  చేస్తాయి .
గుళ్ళో   చేసే  దీపారాధన  , మ్రోగించే  గంట  అర్చకుల  వేదమంత్రాలు, కర్పూర  హారతి, దూపం, పుష్పాల , సుగంధ ద్రవ్యాల  పరిమళాలు   ఇవన్ని  మనపై  ప్రసరించే  శక్తిని  పెంపొందిస్తాయి.
దేవుడికి   అభిషేకం  చేయడం వల్ల ఆ  అయస్కాంత  శక్తి   జలంలోనికి  ప్రసరిస్తుంది. పచ్చకర్పూరం, కుంకుమపువ్వు , తులసి  మొదలగునవి  దాని  శక్తిని  మరింతగా పెంపొందిస్తాయే (magneto therapy). తులసి  రక్తాన్ని  శుద్ధి  చేస్తుంది .  మూడు  సార్లు  తీర్థాన్ని  తీసుకోవడం  వల్ల  శారీరక  రుగ్మతలు  దూరమై  , ఆరోగ్యాన్ని  పొందగలుగుతాం.
పవిత్రమైన  అబిషేక  జలాని  మనపై  జల్లడం  ద్వారా   శక్తి ప్రసారం    అవుతుంది.  అందుకే  మగవారిని  వంటిపై  చొక్కా  వేసుకొని  గర్భ  గుళ్ళోకి  రావోద్దంటారు .
గుళ్ళో  చేసే  కార్యాలు  అందరూ   సామూహికంగా  చేయడం  వల్ల   వ్యక్తీ గత  బాధలు      మర్చిపోయి  ప్రశాంతంగా  ఉండగలుగుతాం. మన  బాగోగులను  ఎంతగానో  ఆలోచించే  మన  పెద్దలు  మనకు  ఈ  నియమ నిబందనలను  పెట్టారు  . వీలైనన్ని  సార్లు  దేవాలయాలను  సందర్శించుకొందాం.    తద్వారా ఎంతో  గొప్పనైన  మన  సంస్కృతిని  సనాతన  ధర్మాన్ని  కాపాడుకుందాం . 
ధన్యవాదాలు
మల్లవజ్జల కిరణ్ కుమార్.  
చూచారు కదండీ ఎంత చక్కని వివరణో!
జైహింద్.
Print this post

4 comments:

సురేష్ బాబు చెప్పారు...

విలువైన సమాచారం పంచుకున్నారు. ధన్యవాదములు.

సురేష్ బాబు చెప్పారు...

విలువైన సమాచారం పంచుకున్నారు. ధన్యవాదములు.

సురేష్ బాబు చెప్పారు...

విలువైన సమాచారం పంచుకున్నారు. ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దేవాలయ సందర్సన మువలన కలుగు మంచి ఫలితాలను వివరించి నందులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.