జై శ్రీరామ్.
సహృదయ ఆంధ్రామృతాభిమానులారా! మీ సహృదయతకు నా కై మోడ్పులు.
గీ:-
సార హీన మైన సంసారమందున
కళలు కాస్త మదికి వెలుగు నిచ్చు.
వాఙ్మనోజ్ఞ శ్రీని వాసరావును గూర్చి
తెలుప నుంటినయ్య. తెలియుఁడయ్య.
అంతర్ జాతీయ స్థాయిలో శబ్దానుకరణ (మిమిక్రీ) విద్య అత్యధిక సమయము ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చరిత్ర పుటలలో ఇంత వరకూ ప్రథమ స్థానమున నిలిచిన అపురూప కళావతంసుఁడయిన శ్రీ శ్రీనివాస్, ఈ అనుకరణ విద్యతో వినూతన పద్ధతిలో శబ్దానుకరణాష్టావధానమును కూడా ప్రదర్శిస్తూ మన తెలుగు భారతాంబ ముద్దు బిడ్డలకు ఉండే సామర్ధ్యమేమిటో ప్రపంచానికి చాటుతున్నారు.
మానవుఁడు అనుకరణ శీలి. ఐనప్పటికీ తన జీవితావసరానుకూలముగా మాత్రమే అనుకరణము నుండి నేర్చుకొంటూ ఉండడం జగద్వితము.
తన అనుకరణ ద్వారా శబ్దమనే వెన్నెల వర్షమును శ్రోతలపై కురిపించే శబ్దానుకరణ చంద్రుఁడు మన శ్రీనివాస్.
మిమిక్రీ పితామహులు శ్రీ నేరెళ్ళ వేణుమాధవన్ శిష్యులైన మన శ్రీనివాస్ గారు తన ప్రదర్శనల ద్వారా ప్రజలకు ఆనందమును కలిగించడమే కాకుండా వారిలోని అమాయకత్వమును సొమ్ము చేసుకొనే గారడీ విద్యా ప్రదర్శకులు చేసే ప్రదర్శనలలోని మర్మమును విప్పి చెప్పుట ద్వారా వివేకవంతులను చేస్తూ సామాజిక దృక్పథంతో రైల్వే ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నారు.
ప్రాచీన కాలమునుండి జాజ్వల్యమానముగా నొప్పుతున్న ఈ చిత్ర బంధ గర్భ కవితా ప్రక్రియ మన ఆంధ్ర భాషకే స్వంతమైనది. ఈ ప్రక్రియ మన తెలుగు భాషాభిమానుల అదృష్టముగా భావిస్తున్నాను. ఆ పద్యం తిలకించండి.
వొ మ ర వ త ర మె వ
సు ధ మ ను మ స్వ ము ను
న వ స్వ ధ న న లి న
సు న య న న వ ర వ
ళి ధ న ము న శ్ర వ ణ
న య ధ న ద వ న ను
వొ మ ర వ త ర మె వ
సు ధ మ ను మ స్వ ము న్
న వ స్వ ధ న న లి న
సు న య న న వ ర వ
ళి ధ న ము న శ్ర వ ణ
న య ధ న ద వ న న
చూచారు కదా! అంతర్జాతీయంగా భారతీయుల యొక్క, ఆంధ్రుల యొక్క కీర్తిపతాకను ఎగుర వేస్తున్న శబ్దానుకరణఅ ధురీణులగు శ్రీ శ్రీనివాసరావుగారిని మనసారా అభినందిస్తూ, ఇంకా ఇంకా సాధన చేస్తూ దేశ విదేశాలలో నిరంతరాయంగా నిరుపమానంగా ఈ కళను ప్రదర్శిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను.
వీరితో మాటాడాలనుకొంటున్నారా? ఐతే ఆలస్యమెందుకు? ఇదిగో వారి సెల్ నెంబర్: 9848060719
శుభమస్తు.
జైహింద్.
Print this post
సహృదయ ఆంధ్రామృతాభిమానులారా! మీ సహృదయతకు నా కై మోడ్పులు.
గీ:-
సార హీన మైన సంసారమందున
కళలు కాస్త మదికి వెలుగు నిచ్చు.
వాఙ్మనోజ్ఞ శ్రీని వాసరావును గూర్చి
తెలుప నుంటినయ్య. తెలియుఁడయ్య.
అంతర్ జాతీయ స్థాయిలో శబ్దానుకరణ (మిమిక్రీ) విద్య అత్యధిక సమయము ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చరిత్ర పుటలలో ఇంత వరకూ ప్రథమ స్థానమున నిలిచిన అపురూప కళావతంసుఁడయిన శ్రీ శ్రీనివాస్, ఈ అనుకరణ విద్యతో వినూతన పద్ధతిలో శబ్దానుకరణాష్టావధానమును కూడా ప్రదర్శిస్తూ మన తెలుగు భారతాంబ ముద్దు బిడ్డలకు ఉండే సామర్ధ్యమేమిటో ప్రపంచానికి చాటుతున్నారు.
మానవుఁడు అనుకరణ శీలి. ఐనప్పటికీ తన జీవితావసరానుకూలముగా మాత్రమే అనుకరణము నుండి నేర్చుకొంటూ ఉండడం జగద్వితము.
తన అనుకరణ ద్వారా శబ్దమనే వెన్నెల వర్షమును శ్రోతలపై కురిపించే శబ్దానుకరణ చంద్రుఁడు మన శ్రీనివాస్.
మిమిక్రీ పితామహులు శ్రీ నేరెళ్ళ వేణుమాధవన్ శిష్యులైన మన శ్రీనివాస్ గారు తన ప్రదర్శనల ద్వారా ప్రజలకు ఆనందమును కలిగించడమే కాకుండా వారిలోని అమాయకత్వమును సొమ్ము చేసుకొనే గారడీ విద్యా ప్రదర్శకులు చేసే ప్రదర్శనలలోని మర్మమును విప్పి చెప్పుట ద్వారా వివేకవంతులను చేస్తూ సామాజిక దృక్పథంతో రైల్వే ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నారు.
ఒక్క గొంతు నుండి అనేకమైన వైవిధ్య భరిత ధ్వనులు అనుకరిస్తున్న వీరికి ఒకే ఒక్క సీస పద్యమనే గాత్రము నుండి అనేక ఛందస్సులనే ధ్వనులతో అభినందిస్తున్నాను.
నేను వ్రాసిన ఈ సీసపద్యమునందు సుమారు పదమూడు వైవిధ్య భరిర ఛందోయుత పద్యములు కలవు. ప్రాచీన కాలమునుండి జాజ్వల్యమానముగా నొప్పుతున్న ఈ చిత్ర బంధ గర్భ కవితా ప్రక్రియ మన ఆంధ్ర భాషకే స్వంతమైనది. ఈ ప్రక్రియ మన తెలుగు భాషాభిమానుల అదృష్టముగా భావిస్తున్నాను. ఆ పద్యం తిలకించండి.
అంతర్జాతీయ
సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారులు
శ్రీమాన్ శ్రీనివాసగారిని
మనస్పూర్తిగా అభినందిస్తూ
అందిస్తున్న
బహు
ఛందో గర్భ సీసము.
రచన:-
చింతా రామ కృష్ణా
రావు.
1.చంపక
- 2.మధ్యాక్కర
- 3.నర్కుట
- 4.కోకిలక
- 5.మణి
గణ భూషణ - 6.7.8.9.ద్వివిధ
కంద ద్వయ - 10.గీత
- 11.ద్రుత
విలంబిత 12.చతురంగ
బంధ ఆటవెలది, 13. చతురంగ
బంధ కంద గర్భ
సీసము:-
స్వర
ఖని భారవీ ప్రతను వర్ధన పద్ధతి
ప్రాక్ధరా! నరా!
దివ్య భావ!
చెరగని
శ్రీ రమన్ క్షితి శుచిం గని,
జేర్చిన శ్రీనివాస!
జ్ఞాన ప్రకాశ!
వర
గనివారమా పతి ప్రవర్ధన ప్రాభవ
ప్రాక్ రమా పథా! బవ్య
గాత్ర!
స్థిర
గుణ ధీరుఁడా! స్థితికి
చింతను, తేలవు.
శ్రీ పరాయణా!
విశ్రుతాత్మ!
గీ:-
శ్రవణ సుకర, శుభ
కర, స్వర సువిధువువొ
!
మరవ తరమె! వసుధ
మనుమ స్వమునరసి.
నవ
స్వధన! నలిన సునయన!
నవ రవళి
ధనమున
శ్రవణ నయ ధనద వనను మను.
1.సీస
గర్భస్థ చంపకమాల:-
స్వర
ఖని భారవీ ప్రతను వర్ధన పద్ధతి
ప్రాక్ధరా! నరా!
చెరగని
శ్రీ రమన్ క్షితి శుచిం గని,
జేర్చిన శ్రీనివాస!
జ్ఞా
వర
గనివారమా పతి ప్రవర్ధన ప్రాభవ
ప్రాక్ రమా పథా!
స్థిర
గుణ ధీరుఁడా! స్థితికి
చింతను, తేలవు.
శ్రీ పరాయణా!
2.సీస
గర్భస్థ మధ్యాక్కర:-
స్వర
ఖని భారవీ ప్రతను వర్ధన పద్ధతి
ప్రాక్ధ !
చెరగని
శ్రీ రమన్ క్షితి శుచిం గని,
జేర్చిన శ్రీని !
వర
గనివారమా పతి ప్రవర్ధన ప్రాభవ
ప్రాక్ ర !
స్థిర
గుణ ధీరుఁడా! స్థితికి
చింతను, తేలవు.
శ్రీ ప !
3.సీస
గర్భస్థ నర్కుటము:-
స్వర
ఖని భారవీ ప్రతను వర్ధన పద్ధతి
ప్రా !
చెరగని శ్రీ
రమన్ క్షితి శుచిం గని,
జేర్చిన శ్రీ !
వర
గనివారమా పతి ప్రవర్ధన ప్రాభవ
ప్రాక్ !
స్థిర
గుణ ధీరుఁడా! స్థితికి
చింతను, తేలవు.
శ్రీ !
4.సీస గర్భస్థ
కోకిలకము:-
స్వర ఖని
భారవీ ప్రతను వర్ధన పద్ధతి
ప్రా !
చెరగని శ్రీ
రమన్ క్షితి శుచిం గని,
జేర్చిన శ్రీ !
వర గనివారమా
పతి ప్రవర్ధన ప్రాభవ ప్రాక్
!
స్థిర గుణ ధీరుఁడా!
స్థితికి చింతను,
తేలవు. శ్రీ
!
5.సీస
గర్భస్థ మణి భూషణము:-
భారవీ
ప్రతను వర్ధన పద్ధతి ప్రాక్ధరా!
శ్రీ రమన్ క్షితి
శుచిం గని, జేర్చిన
శ్రీనివా!
వారమా
పతి ప్రవర్ధన ప్రాభవ ప్రాక్
రమా!
ధీరుఁడా!
స్థితికి చింతను,
తేలవు. శ్రీ
పరా !
6.సీస
గర్భస్థ కందము1a:-
ఖని
భారవీ ప్రతను వ
ర్ధన
పద్ధతి ప్రాక్ధరా! నరా!
చెరగని శ్రీ
గనివారమా
పతి ప్రవ
ర్ధన
ప్రాభవ ప్రాక్ రమా పథా!
స్థిర గుణ ధీ!
7.సీస
గర్భస్థ కందము1b:-
గనివారమా
పతి ప్రవ
ర్ధన
ప్రాభవ ప్రాక్ రమా పథా!
స్థిర గుణ ధీ!
ఖని
భారవీ ప్రతను వ
ర్ధన
పద్ధతి ప్రాక్ధరా! నరా!
చెరగని శ్రీ !
8.సీస గర్భస్థ
కందము2a:-
గని శ్రీ
రమన్ క్షితి శుచిం
గని,
జేర్చిన శ్రీనివాస!
జ్ఞా వర గనివా !
గుణ ధీరుఁడా!
స్థితికి చిం
తను,
తేలవు. శ్రీ
పరాయణా! స్వర ఖని
భా !
9.సీస గర్భస్థ
కందము2b:-
గుణ ధీరుఁడా!
స్థితికి చిం
తను,
తేలవు. శ్రీ
పరాయణా! స్వర ఖని
భా !
గని శ్రీ
రమన్ క్షితి శుచిం
గని,
జేర్చిన శ్రీనివాస!
జ్ఞా వర గనివా !
10.సీస
గర్భస్థ గీతము:-
ప్రతను
వర్ధన పద్ధతి ప్రాక్ధరాన !
క్షితి
శుచిం గని, జేర్చిన
శ్రీనివాస!
పతి ప్రవర్ధన
ప్రాభవ ప్రాక్ రమా ప !
స్థితికి
చింతను, తేలవు.
శ్రీ ప! రాయ!
11.సీస
గర్భస్థ ద్రుత విలంబితము:-
ప్రతను
వర్ధన పద్ధతి ప్రాక్ధరా !
క్షితి
శుచిం గని, జేర్చిన
శ్రీనివా!
పతి ప్రవర్ధన
ప్రాభవ ప్రాక్ రమా!
స్థితికి
చింతను, తేలవు.
శ్రీపరా!
12.సీస
గర్భస్థ చతురంగ బంధ ఆటవెలది:-
(స్వరమను - ధనమున
- వరలిన - స్వరవిధు!)
శ్రవణ
సుకర, శుభ కర,
స్వర సువిధువువొ!
మరవ తరమె!
వసుధ మనుమ స్వమున.
నవస్వ ధన!
నలిన సు నయన! నవ
రవళి
ధనమున
శ్రవణ నయ ధనద వనను.
శ్ర వ ణ సు క ర శు భ
క ర స్వ ర సు వి ధు వువొ మ ర వ త ర మె వ
సు ధ మ ను మ స్వ ము ను
న వ స్వ ధ న న లి న
సు న య న న వ ర వ
ళి ధ న ము న శ్ర వ ణ
న య ధ న ద వ న ను
13.సీస
గర్భస్థ చతురంగ బంధ కందము:-
(
స్వరమను - ధనమున - వరలిన - స్వరవిధు! )
శ్రవణ
సుకర, శుభ కర,
స్వర
సువిధువువొ!
మరవ తరమె! వసుధ
మనుమ స్వమున్.
నవ స్వధన!
నలిన సునయన!
నవ రవళి
ధనమున శ్రవణ నయ ధనద వనన్.
శ్ర వ ణ సు క ర శు భ
క ర స్వ ర సు వి ధు వువొ మ ర వ త ర మె వ
సు ధ మ ను మ స్వ ము న్
న వ స్వ ధ న న లి న
సు న య న న వ ర వ
ళి ధ న ము న శ్ర వ ణ
న య ధ న ద వ న న
మంగళం మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
చూచారు కదండీ! ఇక ఆ శ్రీనివాస్ గారి ధ్వన్యానుకరణ ప్రదర్శనకు సంబంధించిన చలన చిత్రం కూడా దర్శించండి.
చూచారు కదా! అంతర్జాతీయంగా భారతీయుల యొక్క, ఆంధ్రుల యొక్క కీర్తిపతాకను ఎగుర వేస్తున్న శబ్దానుకరణఅ ధురీణులగు శ్రీ శ్రీనివాసరావుగారిని మనసారా అభినందిస్తూ, ఇంకా ఇంకా సాధన చేస్తూ దేశ విదేశాలలో నిరంతరాయంగా నిరుపమానంగా ఈ కళను ప్రదర్శిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను.
వీరితో మాటాడాలనుకొంటున్నారా? ఐతే ఆలస్యమెందుకు? ఇదిగో వారి సెల్ నెంబర్: 9848060719
శుభమస్తు.
జైహింద్.
2 comments:
Hi, Sir
Very good introduction.
We need Mimicry Srinivas contact number, plz.. mail to me.
thanq
Kalasagar
Editor
www.64kalalu.com
ఛాలా బాగుంది .ఒకరిని మించిన ప్రతిభ మరొకరిది . అభినంద నీయులు హేట్సాఫ్ !
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.