గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2012, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి117.

జై శ్రీరాం.
శ్లోll
అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్,
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
గీః-
ముదిమి మరణము లేనట్లు ప్రోగు చేయు
ధనము, విద్యయు ప్రాజ్ఞులు ధరణిపైన.
కేశమును పట్టె మృత్యువన్ ధ్యాస గలిగి
ధర్మ మాచరింపగ తగు ధన్యత గన.
భావముః-
ప్రాజ్ఞుడైనవాడు ముసలిదనమూ చావూ లేనివాడిలాగ విద్యనూ అర్థాన్నీ సాధించాలి.
అలాగే, మృత్యువు జుట్టు పట్టుకుందా అన్నట్టుగా, ధర్మాన్ని ఆచరించాలి.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చాలా మంచి విషయాలను అందించారు .నిజంగా మేలిమి బంగారమే .ఆశీర్వ దించి అక్క

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ రామకృష్ణా రావు గారూ నమస్సులు మీ తెలుగు సేత అద్భుతముగా నుంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.