గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2012, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి118.

జై శ్రీరామ్.
శ్లోll
శరీరస్య గుణానాంచ దూర మత్యంత మంతరం
శరీరం క్షణ విధ్వంసీ. కల్పాంత స్థాయినో గుణాః
గీః-
దేహమునకు గుణములకు దీపితమగు
దూరమెక్కుడు తెలియగ. ధీరులార!
క్షణములో పోవు దేహము. గుణము లెల్ల
నిలుచు శాశ్వితముగ యని తెలియఁ దగును.
భావముః-
శరీరమునకు, గుణమునకు యెంతో అంతరమున్నది. శరీరము క్షణములో విధ్వంసమగునది. గణములు మాత్రము కల్పాంతము నిలుచునవి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.