గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జనవరి 2012, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 116.

జైశ్రీరాం.
శ్లోll
జకారో జన్మ విచ్చేదః పకారో పాపనాశక:
జన్మపాప వినాశిత్వాత్ జప ఇత్యభిదీయతే
గీః-
కలుగనీయదు జన్మ జకార మరయ.
కలుగు పాపము బాపు పకార మదియు.
జన్మ పాప వినాశిని జపము కాన
జపము చేయంగ తగునయ్య సద్విధేయ.
భావముః-
జకారము జన్మను పొందకుండా చేయును. పకారముపాపమును నశింప జేయును. జన్మ పాప వినాశనములు చేయునది కావుననే జపము అనబడుచున్నది. ఇంతటి ప్రయోజన కరమైన జపమును ప్రతీ వ్యక్తియు ఆచరింప వలయును.
జైహింద్.
Print this post

4 comments:

Pandita Nemani చెప్పారు...

అనఘగుణ రామకృష్ణా!
తెనుగున శ్లోకమ్ము ననువదించుచును జప
మ్మునకర్థము వివరించితి
సునిశిత ధీమంత! ఘన యశోధన! సెహబాస్

మన తెలుగు చెప్పారు...

శ్రీ రామకృష్ణగారికి నా మెచ్చుకోలు. మంచి శ్లోకము, దానికి తగ్గట్లు అనువాదము, మంచి ప్రతిమ ఇచ్చినందులకు. జప మహిమ ఇంత అని చెప్పలేము. ఈ నాటి యువత ముఖ్యంగా ఈ విషయం స్వానుభవంతో తెలుసుకోవాలి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యుఁడ నే. సత్పండిత!
మాన్యులు మీ సత్ప్రశంస మహనీయంబై
పుణ్య ప్రదమగు రచనల
గణ్యంబుగ చేయ జేయు. కవివర!ప్రణతుల్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

" జకార , పకారములను " గురించి , మంచి వివరణ ఇచ్చి , జపము యొక్క ప్రాముఖ్యతను తెలియ జెప్పిన చింతా వారికి అభినం దనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.