గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఏప్రిల్ 2024, ఆదివారం

అదత్తేత్యాగతా లజ్జా ... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

 శ్లో.  అదత్తేత్యాగతా లజ్జా  -  దత్తేతి వ్యథితం మనః |

ధర్మస్నేహాంతరే న్యస్తాః  -  దుఃఖితాః ఖలు మాతరః || 

(ప్రతిజ్ఞాయౌగంధరాయణం)

ఆ.వె.  పెళ్ళికాని కూతులిళ్ళలో నుండినన్, 

పెళ్ళి జరిగి వారు వెళ్ళిరేని,   

తల్లి మనసు సిగ్గునల్లల్లనాడుట

దుఃఖమొందును, సుదతులకు దిగులె.  

భావము.  ఎదిగిన ఆడపిల్లకు పెళ్ళికానంతవరకు తల్లికి సిగ్గుగావుంటుంది. 

పెళ్ళయితే కూతురిని విడచివుండటానికి తల్లి మనసు బాధపడుతుంది. 

ఇలా ఒక వైపు కర్తవ్యమూ, మరోవైపు మమత - ఈ రెంటి నడుమ చిక్కుకొన్న 

తల్లుల మనస్సు దుఃఖిస్తుంది.

జైహింద్.

జైశ్రీరామ్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.