జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ.
శంకరాభరణ వృత్తము పద్య పంచకము.
రచన...చింతా రామకృష్ణారావు.
శంకరాభరణ వృత్తము.
శ్రీగుణాలము నిన్ దలంపన్ జేరున్ మమున్ సంతతంబున్
రాగరంజిత సన్మదిన్ నీ రమ్యాకృతిన్ దల్చినంతన్
వేగమే కవితామృతంబే జ్ఞేయంపు సుజ్ఞానదీప్తిన్
యోగమై పరమార్థ సద్ధీయుక్తిన్, బ్రభన్ గొల్పు వాణీ! 1.
మానవాళికి మేలు సేయన్ మాతా! కృపన్ జ్ఞాన దీప్తిన్
బ్రాణ శక్తిని నిల్పి నీవే వర్ధిల్లగా జేయుచున్ స
న్మానసంబిడి మాకు క్షేమంబై శోభనల్ కొల్పు దీవే,
మానసంబులలోన, నిత్యంబై ప్రీతితో వెల్గు, వాణీ! 2.
గోమూత్రికాబంధ గుప్తపంచమపాద శంకరాభరణ వృతము.
శంకరయ్యజయంబులన్గూర్చంగన్సతం బెంచి కూర్చెన్
సంకటంబులణంచ, దివ్యస్వర్ణామృతంబి చ్చు శక్తిన్
శంక రా భర ణమ్ముదివ్య జ్ఞానాక్షియే
విచ్చునట్లున్
సంకుశోభ నెసంగు భవ్యజ్ఞానాకృతీ! పద్య వా ణీ! 3.
ఇందలి గుప్త పంచమ పాదము.
శంకరాభరణంబు, దివ్యజ్ఞానామృతంబిచ్చు వాణీ!
గవాక్షబంధ శంకరాభరణ వృత్తము.
చింతితావ్యయ వీవ,నిన్నున్ జేరన్ వరానంద మబ్బున్,
చెంతనన్వరలంగనిమ్మా చిద్భాసినీ! యుండు నాలో.
సాంతముండుమునీడవై ధ్యాసన్ గొల్చెద నేను నిన్ను
న్శాంతి నామది నిల్పుహే
వి శ్వజ్ఞాన పారీణ వాణీ! 4.
చిం
తితావ్య
య వీవ,నిన్నున్
జేరన్ వరానంద మ
బ్బున్,చెంతనన్వరలం
గని
మ్మా చిద్భాసినీ! యుండు నాలో.సాంత
ముండుమునీడవై ధ్యాసన్ గొ
ల్చెద
నేను
నిన్నున్శాం
తి నామది ని
ల్పుహే వి
శ్వ
జ్ఞాన పారీణ వాణీ!
మంగళాంగి! యుపేక్ష యేలన్? మమ్మున్ భువిన్ బ్రోవ దేవీ!
బెంగలన్ మదినుండి
పాయన్
బ్రీతిన్
గృపన్ జేయుమమ్మా.
భంగ పాటులు గొల్పకమ్మా, భక్తిన్ నినున్ గొల్తు నెమ్మిన్,
మంగళంబులనిమ్ము
వాక్సన్మార్గంబునన్
నిల్పు వాణీ! 5.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.