గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

గ్రహణం ధారణం చైవ ... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో. గ్రహణం ధారణం చైవ  -  స్మరణం ప్రతిపాదనమ్ |

ఊహాపోహాఽర్ధవిజ్ఞానం  -  తత్త్వజ్ఞానం చ ధీగుణాః || (కామన్దక నీతిసారం)

తే.గీ.  గ్రహణ ధారణ స్మరణముల్ కలిగియుండి,

దాని ప్రతిపాదనమ్ము, తత్ తత్వగరిమ

నెఱిగి, చెప్పు టూహించుటలింత కాక,

సంశయనివృత్తి కలిగి ప్రశంసలందు.

భావం. వినాలనే కోరిక కలగడం, వినిన విషయాన్ని గ్రహించటం, 

గ్రహించినదానిని మనస్సున నిలుపుకొనడం, నిలుపుకొనినదాన్ని 

గుర్తుకు తెచ్చుకోవడం, చెప్పడం, ఊహించడం, సంశయనివృత్తి 

చేసుకోవడం, అర్థమును చక్కగా గ్రహించడం, తత్త్వజ్ఞానాన్ని

 తెలుసుకొనడం అను ఈ ఎనిమిది బుద్ధిమంతులకు గల గుణాలు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.