గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2020, సోమవారం

ఏడువారాల నామసార్ధక్యం.

జైశ్రీరామ్.
వారానికి ఏడు రోజులు 
ఎందుకు 

_రోజుకు 24 గంటలు కదా hour అనే పదం ఎక్కడిది ?_

_ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు ? మంగళ వారం రావొచ్చుగా ?

ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే మందు  మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకోవలసి ఉంది.

ప్రపంచంలో ఏదేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు.

ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి
మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే.

ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది ?ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది ?

ఎప్పుడు చంద్రగ్రహణం ? ఎప్పుడు సూర్యగ్రహణం ?

ఏ కార్తెలో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే..ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే.

పైన ప్రశ్నకి సమాధానం

మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము, బుధ వారము, గురు వారము, శుక్ర వారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు ?

ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.

భారత కాలమానంలో  హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR. ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రంలో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరాలు ప్రతి రోజూ వుంటాయి.

ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి. 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది.. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మళ్ళీ శని హోరాకి.

ఉదాహరణకు ఆదివారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు  పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుధ హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.

ఆ తర్వాత హోరా 25వ హోరా. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతో ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభమవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.

చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.

రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్నా కూడా సూర్యుడు పేరే. కావుననే ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడులో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి.

ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి ? మంగళ వారం రాకూడదా ?

రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరాతో ప్రారంభం అయ్యింది కాబట్టి.

ఇది మన భారతీయుల గొప్పతనం.. ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం.

ప్రపంచంలో దేశమయినా మన పద్ధతి ఫాలో అవ్వాల్సిందే.. కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ.

ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారతదేశ సంప్రదాయాన్ని ప్రపంచమంతా అనుసరిస్తున్నది.


జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎన్నో తెలియని విషయాలను చక్కగా వివరించారు. ధన్య వాదములు

Unknown చెప్పారు...

నాకు ఈ సమయంలో యెందుకో నిద్దరపట్టలేదు. ఎందుకు అంటే, అదేంటొ ఒక్కసారిగా, "ళ" అనే అక్షరం యెలా రాయాలో నా మనసులో ఊహించుకుంటున్నప్పుడు అది సరిగా రాసుకోలేకపోతున్నాను మనసులో. అప్పుడు నా మొబైల్ లో "స్వరచక్ర" తెలుగు లెటర్ keyboard లో చూసి నా సందేహాన్నిఅతీర్చుకున్నాను. ఐతే, అందులో అ-ఆ లను మరియు గుణింతాలను చూసినప్పుడు నాకు "ఱ" గుర్తుకొచ్చింది. దాని గురించి google లో తెలుసుకునే తరుణంలో మీ "తెలుగామృతం" అను website లోకిరావడం, అందులో "అరసున్న మరియు ఱ" ల గురించి తెలుసుకోవడంతోపాటు, "వారములు ఎలా ఏర్పడినవో కూడా మీ చక్కని వివరణతో తెలుసుకున్నాను". మీ webpage ని save చేసుకున్నాను. ఇప్పుడిక హాయిగా పడుకుంటాను. :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.