గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2020, ఆదివారం

శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కము.భావసహితము

జైశ్రీరామ్.
శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కము.
1.మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్త్రే
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అనేటటువంటివి ఏమీ నేను కాను.చెవి,నాలుక,ముక్కు, నేత్రములు మొదలైన ఇంద్రియాలను నేను అసలు కాను.ఆకాశము,భూమి,అగ్ని,వాయువు,నీరు లాంటి పంచభూతాలను నేను కానే కాను . ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
2.న చ ప్రాణ సంజ్నో న వై పంచవాయు:
న వా సప్తధాతు ర్న వా పంచకోశ:
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
ప్రాణమనే పేరు కలవాడను కాను.ఐదు రకములైన వాయువును కాను.సప్తధాతువులను కానే కాను.పంచకోశములను కాను.మాట,చేయి,పాదములను కాను.సహాయపడే ఇంద్రియాలను కానే కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
3.న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదోనైవ మే నైవ మాత్సర్యభావ:
న ధర్మో న చార్ధో న కామో న మోక్ష:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
రాగద్వేషాలంటే నాకు తెలియదు.లోభమోహాలు అంటే అసలు తెలియవు. మద మాత్సర్యములు నాకు లేనే లేవు.ధర్మ,అర్ధ,కామ మోక్షములు నాకు అసలు లేనేలేవు. ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా:
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
పుణ్యపాపాలు,సుఖదు:ఖములు నాకు లేనే లేవు.మంత్రంలేదు,క్షేత్రములు లేవు.వేదములు,యజ్ఞములు అసలు లేనే లేవు.నేను భోజనాన్ని కాను,భోజ్యమును కాను,భోక్తను కూడా కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
5.న మృత్యు ర్న శంకా న మే జాతి భేద:
పితో నైవ మే నైవ మాతా న జన్మ
న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
నాకు మరణంలేదు.మృత్యుభయం,సందేహం లేదు.జాతిభేదములు లేనేలేవు.తండ్రిలేడు,తల్లి లేదు.అసలు నాకు పుట్టుకయే లేదు.బంధుమిత్రులు,గురుశిష్యులు లేనేలేరు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
6.అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చా సంగతం నైవ ముక్తి ర్నమేయ:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
నాకు ఎటువంటి వికల్పములు,బేధములు నాకు లేవు.నేను,నా ఇంద్రియాలు విశ్వమంతా వ్యాపించినట్లు అనిపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కానీ,విషయములు కానీ లేనేలేవు.నేను తెలుసుకొన వలసినది మరియూ పొందవలసిన మోక్షమూ లేదు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.