జైశ్రీరామ్.
మదనాగరు,శ్రీశుభా,సుధారస,. గర్భ "-ఆహ్లాదినీ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
ఆహ్లాదినీ వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.య.స.స.భ.స.స.గ గ.గణములు.యతులు.10,21.
ప్రాసనీమముగలదు.
మదిమెదలు సుధ వీవే! మదనాగరు కస్తూరి తిలక!మాధవకృష్ణా!శ్రీ
ముదమున ననుగనున్లే!మధుసూదన!గోపాల!మధు రమాధురి!తానౌచున్!
సదమల!నయన!శ్రీశా!సదయానిధి!వైకుం ఠనిలయు!సాదరమేర్పంగా!
పదిపదుల!వరదాలన్!పధగాముడు!గీతా ర్ధవిభుడు!బాధలనాపున్లే!
1.గర్భగత"-భుజగ శిశురుత"-వృత్తము.
బృహతీఛందము.న.న.య.గణములు.వృ.సం. 128.ప్రాసగలదు.
మదిమెదలు!సుధవీవే!
ముదమున!నను!కనున్లే!
సదమలనయన!శ్రీశా!
పదిపదుల!వరదాలన్!
2.గర్భగత"-శోభా"-వృత్తము.
గాయిత్రీఛందము.భ.మ.గణములు.వృ.సం .07.ప్రాసగలదు.
మాధవ!కృష్ణా ! శ్రీ!.
మాధురి! తానౌచున్!
సాదర! మేర్పంగా!
బాధలు!మాపున్లే!
3.గర్భగత"-కలిగుణ"- వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.గల.గణములు. వృ.సం.156.ప్రాసగలదు.
మదనాగరు!కస్తూరి!
మధుసూదన!గోపాల!
సదయానిధి!వైకుంఠ!
పధగాముడు!గీతార్ధు!
4.గర్భగత"-కస్తూరి "-వృత్తము.
అత్యష్ష్టీ ఛందము.స.స.భ.స.స.గగ.గణములు!
యతి12.యక్షరము.
మదనాగరు!కస్తూరితిలక! మాధవకృష్ణా! శ్రీ !
మధుసూదన!గోపాల!మధుర మాధురి!తానౌచున్!
సదయానిధి!వైకుంఠనిలయు!సాదరమేర్పం గా!
పధగాముడు!గీతార్ధు!విభుడు!బాధలు మాపున్లే!
5.గర్భగత"-కస్తూరి తిలక"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.భ.స.స.త.న.స.గ గ.గణములు.యతులు.12,18.
ప్రాసనీమముగలదు.
మదనాగరు కస్తూరి తిలక!మాధవ!కృష్ణా! శ్రీమదిమెదలు సుధ!వీవే!మదుసూదన!గోపాల!మధుర!మా ధురితానౌచున్!ముదమున!ననుగనున్లే !
సదయానిధి!వైకుంఠనిలయు!సాదర మేర్పంగా!సదమలనయన!శ్రీశా!
పధగాముడు!గీతార్ధు!విభుడు!బాధలు !మాపున్లే!పదిపదుల!వరదాలన్!
6.గర్భగత"-మాధవా"-వృత్తము.
అతిజగతీఛందము.న.న.య.భ.మ.గణములు. యతి.10.ప్రాసగలదు.
మదిమెదలు!సుధ వీవే!మాధవకృష్ణా!శ్రీ
ముదమున!ననుగనున్లే!మాధురి!తానౌ చున్!
సదమల నయన!శ్రీశా!సాదరమేర్పంగా!
పదిపదుల!వరదాలన్! బాధలు మాపున్లే!
7.గర్భగత"-సుధీ"-వృత్తము.
అతిజగతీఛందము.భ.మ.న.న.య.గణములు. యతి.07.ప్రాసగలదు.
మాధవకృష్ణాశ్రీ! మదిమెదలు!సుధ వీవే!
మాధురి!తానౌచున్!ముదమున!ననుగను న్లే!
సాదరమేర్పంగా! సదమల!నయన శ్రీశా!
బాధలు!మాపున్లే!పదిపదుల!వరదాలన్ !
8.గర్భగత"-మదనాగరు"-వృత్తము.
ఉత్కృతీఛందము.భ.మ.న.న.య.భ.స.భ.ల ల.గణములు.యతులు.07,16.ప్రాసనీ మముగలదు.
మాధవకృష్ణా!శ్రీ!మదిమెదలు!సుధవీ వే!మదనాగరు!కస్తూరి తిలక!
మాధురి!తానౌచున్!ముదమున!ననుగను న్లే!మదుసూధనగోపాలమధుర!
సాదర మేర్పంగా!సదమల!నయన!శ్రీశా!సదయా నిధి!వైకుంఠ!నిలయు!
బాధలు!మాపున్లే!పదిపదుల!వరదాలన్ ! పధగాముడు!గీతార్ధవిభుడు!
9.గర్భగత"-శ్రీశుభా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.మ.స.స.భ.లల. గణములు.యతి07.ప్రాసగలదు.
మాధవకృష్ణా!శ్రీశా! మదనాగరు!కస్తూరితిలక!
మాధురి తానౌచున్!మధుసూదన!గోపాల!మధుర!
సాదరమేర్పంగా!సదయానిధి! వైకుంఠన!నిలయు!
బాధలు!మాపున్లే!పధగాముడు!గీతార్ ధవిభుడు!
10.గర్భగత"-సుధారస"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.భ.న.న.న.మ.స.గ గ.యతులు.12.21.
ప్రాసనీమముగలదు.
మదనాగరు కస్తూరి!తిలక!మదిమెదలు సుధి!వీవే!మాధవకృషష్ణా!శ్రీ
మదుసూదన!గోపాల మధుర!ముదమున!ననుగనున్లే!మాధురితా నౌచున్
సదయానిధి!వైకుంఠనిలయు!సదమలనయన శ్రీశా!సాదరమేర్పంగా!
పధగాముడు!గీతార్ధవిభుడు!పదిపదుల !వరదాలన్!బాధలు!మాపున్లే!
స్వస్తి.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవికి నా అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్..
1 comments:
నమస్కారములు
సరస్వతీ పుత్రులు శ్రీ వల్లభవఝుల వారికిప్రణామములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.