జైశ్రీరామ్
సప్తపర్ణ మండప బంధము
గంధినీవృత్తము.
అతిశక్వరీఛందము.ర.జ.ర.జ.ర.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.10,923.
నావ నీవ గావ దేవేనా వరా వశం వరా!
భావ మీవ రావ మీవ!భావనా వరీవయా!
దైవ మీవ నేవ మీవ!తావళా వనీవ శ్రీ?
పావనా వరీవ?సేవ భావ మీవ?శ్రీవరా!
సప్తపర్ణము=అరటియాకు,పర్ణము=తమలపాకు,
తమలపాకు ఈనెల నాధారముగా పైబంధమునిర్మించడమైనది.
మంటపము నాలుగు ప్రక్కలానాలుగు తమలపాకులు చతురస్రాకారము
గా పేర్చిమండపమేర్పరచితిని.
1.నైరుతి,వాయవ్య.దిశయందుంచిన తమలపాకునందు ఈనెలప్రాప్తికి
పద్యమందలి రెండుచరణములు వ్రాసితిని.
2.వాయవ్య,ఈశాన్యములకు పరచిన తమలపాకు నందు,పద్యమున
మిగిలిన రెండు పాదములు,వ్రాసితిని.
3.నైరుతి,ఆగ్నేయములకు పరచిన తమలపాకు నందు,మరల పద్యము
రెండు చరణములు వ్రాసితిని.
4.ఆగ్నేయ,ఈశాన్యములకు పరచిన తమలపాకు నందు పద్యము3,4.
చరణములు వ్రాసితిని.
ఈమండప నిర్మాణములో పద్యముపునరావృతమైనది.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
సప్తపర్ణ మండప బంధము అద్భుతముగా నున్నది .వల్లభవఝుల వారి ప్రతిభ శ్లాఘనీయము . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.