జైశ్రీరామ్.
శ్లో. ఆచినోతిహి శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపిస్వయం ఆచరతే యస్మాత్తస్మాదాచార్య ఉచ్యతే.
క. శాస్త్రంబులనుసరించుచు,
శాస్త్రాంబులు బోధఁ జేసి, చక్కఁగ ప్రజలన్
శాస్త్రంబులాచరింపఁగ
శాస్త్రజ్ఞులు చేయుదురిల సత్యాచార్యుల్.
భావము. శాస్త్రము ఆకళింపు చేసుకొని వారు ఆచరించుచుారి బోధనల ద్వారా యితరులను ఆచరింప చేసేవారేఆచార్యులు అని చెప్పఁబడినది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును . వారు ఆచరించడమే గాక నలుగురికి పంచినచో వారి విజ్ఞానము సార్ధక మగును కదా .మంచి సూక్తి . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.