గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, నవంబర్ 2017, శనివారం

శ్రీ కందుల వరప్రసాదు బంధకవి కృత కుండలి నాగ బంధ కందము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ కందుల వరప్రసాదు బంధకవి కృత కుండలి నాగ బంధ కందమును చూచి, మీ అమూల్యమైన అభిప్రాయంతో పాటు అభినందనలు కూడా మీరు తెలియఁజేయఁగలరనిఆశించుచున్నాను.
ఇక చూడండి.
శ్రీ కందుల వరప్రసాదు బంధకవి కృత కుండలి నాగ బంధ కందము

కం. నారద సేవిత హరి మరి
కోరి వనజనయన నిలచె కూరిమి నొందన్
జేరితి నీదరి ధీరా
పారా! ఘనవరధర నిల పంకజ నయనా!

ఈ రచనకు స్ఫూర్తి నిచ్చిన వారికెల్లను వందనములు. ముఖ్యంగా
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి , శ్రీ కంది శంకరయ్య గారికి శ్రీ చింతా రామక్రుష్ణారావు గారికి , శ్రీమతి సుప్రభ గారికి , శ్రీ మూర్తి గారికి ధన్యవాదములతో.
స్వస్తి.
కందుల వరప్రసాద్.
కుండలి నాగ బంధ కందరచయిత శ్రీ ప్రసాదు గారికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ కందుల వరప్రసాదు గారికి అభినందన మందారములు .

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవా నా శక్తి మీకు తెలియనిది కాదు, పామరుఁడను మీ ప్రోత్సాహముతో పద్యములు వ్రాయగలుగుచున్నాను. మీ వంటి పండితుల పాదసేవకు పాత్రుడనైతిని, అదియే పదివేలు.

Unknown చెప్పారు...

అక్కయ్య గారికి అభిమానమునకు అక్కయ్యగారి పాదపద్మములకు ప్రణమిల్లుచూ ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.