జైశ్రీరామ్.
ఆర్యులారా! మన సాహితీ బంధువు శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు కవి విరచించిన
నాగ శ్రీ బంధ కందము
చక్కగా ఉన్నది. చూడఁగలరు.
మా స్వగ్రామము(గవరపేట)లో ప్రతీ దీపావళికి గౌరిదేవిని మా దేవాలయము నందు ప్రతిష్టించి, ఒక మాసము అమ్మవారు మా పురజనుల పూజలందుకొనును. ఇటువంటి గవరపేటలందు సంబరాలు(క్షణములు) అంబరాన్ని అంటుతాయి.శ్రీకారబంధము
కం. శ్రీ గౌరి! హృదయ శంకరి
గా, గాంధర్వి! దయతోడఁ గాంచుము తల్లీ!
యీ గవరపేట లందు స్వ
రాగాల క్షణము లిడుదుము, ప్రణయము నందున్!
స్వస్తి.
పొలిమేర మల్లేశ్వరరావు.
బంధకవితాభిలాషులగు శ్రీ మల్లేశ్వరులకభినందనలు.
జైహింద్.

వ్రాసినది












3 comments:
సాహితీ బంధువు శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు గారి శ్రీకారబంధము అద్భుతంగానున్నది . వారికి మాకందించిన మీకు అభినందన వందనములు.
నమస్కారములు
శ్రీ పొలిమేర మల్లేశ్వర రావుగారి నాగశ్రీ బంధ కందము అలతి అలతి బదములతో అందముగా నున్నది . అభినందన మందారములు
శ్రీ మల్లేశ్వరరావుగారి నాగశ్రీ బంధకందమందముగాా యున్నది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.