గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, నవంబర్ 2017, శుక్రవారం

శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ కవి కృత ఆందోళికా బంధ సీసము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ కవి కృత ఆందోళికా బంధ సీసము తిలకించండి.ఆందోళికా బంధ సీసము (దేవి స్తుతి) 
శ్రీ మాత, కాలిక, శ్రీ గౌరి, మారి, గిరిజ, రంభ ,లంభ ,శాంభవి, చల, జ్వాల, లలన, రామ,
రమ,హైమవతి, దుద్దురా, శివానీ,శ్రీనగజ, యచలజ, సతి,కాళి, హిండి
శారద,నగజాత, చండి,చర్చ,పరుల, కౌశికి, దేవేశి,గట్టుపట్టి
శాకిని, యాదవి, శాంభవి ,పాటల,కమలాలయ, యమల, కలిమి చెలియ,
రమ్య వదన, విశాలాక్ష్మి, రక్షి, జలధి
జ, సిరి, వాక్కాంత, భారతి, చపల, దక్ష
దనయ, సీత, సనాతని, తల్లి తల్లి ,
కరుణతో జూచుచూ ,నన్ను గాచ వలయు.
స్వస్తి.
పూసపాటి కృష్ణ సూర్యకుమార్
కవిగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వీయెస్సెన్ మూర్తిగారికి శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.